Mask paint : మాస్క్ లాగా పెయింట్ వేసుకుని యువతి ఓవర్ యాక్షన్..పాస్ పోర్ట్ సీజ్ చేసిన అధికారులు!

Mask paint : మాస్క్ లాగా పెయింట్ వేసుకుని యువతి ఓవర్ యాక్షన్..పాస్ పోర్ట్ సీజ్ చేసిన అధికారులు!

Woman Painting Mask On Her Face Instead  (1)

Woman painting mask on her face instead :  కరోనా రూల్స్ సరిగా పాటించకుండా మాస్క్ పెట్టుకోమంటే నాటకాలాడుతున్నారు కొంత మంది. అటువంటి ఓ యువతి అతి తెలివికిపోయి ముఖానికి సర్జికల్ మాస్క్ ఉన్నట్లుగా ‘పెయింట్’ వేసుకుంది. అలా ఆమెను చూస్తే మాస్క్ పెట్టుకున్నట్లుగానే ఉన్నారు. బాగా పరిశీలనగా చూస్తే తప్ప వాళ్లు మాస్కు పెట్టుకోలేదనే విషయం గుర్తంచటం కష్టమే. అలా పెయింట్ వేసుకుంది. కానీ అతి తెలివి కాస్తా బైటపడింది. ఓవర్ యాక్షన్ బైటపడింది.



ఇండొనేసియాలోని పర్యాటక ప్రాంతం బాలిలో…ఓ షాపింగ్ మాల్ కు వచ్చారు ఓ యువకుడు, ఓ యువతి. ఆమె భర్త మాస్క్ పెట్టుకున్నాడు కానీ… ఆమె పెట్టుకోలేదు. కారులోనే కూర్చుని అచ్చం సర్జికల్ మాస్క్ లాంటి పెయింటింగ్ వేసుకుంది.కారులో ఉండి… బ్లూ కలర్ పెయింట్ వేసుకోవడం, చెవులకు మాస్క్ దారం ఉన్నట్లుగా వైట్ కలర్ పెయింటింగ్ వేసుకోవడం ద్వారా… దూరం నుంచి ఆమెను చూసిన వారు… ఆమె మాస్క్ పెట్టుకున్నట్లుగా ఉందని తెలుస్తుంది. కానీ పరీక్షగా చూస్తే అసలు విషయం అర్థం అవుతుంది. ఆమె షాపింగ్ మాల్‌లోకి వెళ్తున్నప్పుడు సెక్యూరిటీ గార్డు గుర్తించలేకపోయాడు. అలా మాల్ లో తిరుగుతూ..జనాన్ని ఫూల్స్ చేస్తున్నట్లు ఫీలవుతూ… జోష్ పాలెర్ లిన్, లియా సీ… వీడియోలు కూడా తీసుకున్నారు. మాల్ అంతా ఇష్టమొచ్చినట్లు తిరిగారు.



ఆ జంట అందర్నీ మోసం చేసినట్లు భావిస్తూ ఏదో మేధావుల్లా తిరుగుతుండగా..ఓ మహిళ మాత్రం గుర్తించింది. అసలు విషయాన్ని తెలుసుకుంది.దాన్ని వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో అదికాస్తా ఇండొనేసియా ఇమ్మిగ్రేషన్ అధికారుల దృష్టికి వెళ్లటంతో వారిని గుర్తించి వారి పాస్‌పోర్టులను సీజ్ చేశారు.