గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వకపోతే..జయలలిత సమాధిని పేల్చేస్తా : డీజీపీకి ఆఫీసుకొచ్చి వార్నింగ్

గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వకపోతే..జయలలిత సమాధిని పేల్చేస్తా : డీజీపీకి ఆఫీసుకొచ్చి వార్నింగ్

Updated On : February 11, 2021 / 12:47 PM IST

Bomb threat phone call tamil nadu cm house :గవర్నమెంట్ ఉద్యోగం రావాలంటే కష్టపడి చదవాలి. కానీ..తమిళనాడులో ఓ యువకుడు మాత్రం ‘నాకు గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వకపోతే దివంగత సీఎం జయలలిత సమాధిని బాంబులతో పేల్చేస్తా’నని ఏకంగా డీజీపీ ఆఫీసుకు వచ్చి మరీ హెచ్చరించిన ఘటన కలకలం రేపింది. తనకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వకపోతే..మెరీనాతీరంలోని జయలలిత సమాధిని పెట్రోబాంబులతో పేల్చేస్తానని ఓ యువకుడి డీజీపీ ఆఫీసుకు వచ్చి మరీ వార్నింగ్ ఇచ్చాడు.

దీంతో అతడ్ని వెంటనే అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించగా పొంతనలేని సమాధాలు చెప్పాడు. అతని సమాధాలు చెప్పే తీరును బట్టి అతని మానసిక సమస్యలు ఉన్నట్లుగా అనుమానించారు. వెంటనే మానసిక వైద్య నిపుణుల వద్దకు పంపించగా అది నిజమేనని తేలటంతో పోలీసులు హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు.

తమిళనాడులోని కొరుక్కుపేట భారతీరాజా హౌసింగ్‌ బోర్డుకు చెందిన మణిగండన్ అనే యువకుడు‌ బుధవారం (జనవరి 10)మెరీనా తీరంలోని డీజీపీ ఆఫీసుకు వచ్చి..అక్కడి కంప్లైంట్లు చేసే విభాగానికి వెళ్లి..‘‘తనకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని..లేకపోతే మాజీ జయలలిత సమాధిని నాటుబాంబులతో పేల్చేస్తానని యువకుడు హెచ్చరించాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకుని సోదాలు చేశారు.

కానీ మానసిక రోగి అని తెలియటంతో మెరీనా పోలీసులకు అప్పగించారు. వారు సమగ్ర విచారణ తర్వాత ఉద్యోగ ప్రయత్నంలో మానసిక ఒత్తిడికి గురైనట్టు తేలింది. దీంతో అతడ్ని మానసిక వైద్యుల వద్దకు పంపించారు. కాగా..చెన్నై గ్రీన్‌వేస్‌ రోడ్డు, సేలంలోని సీఎం పళనిస్వామి నివాసాల్ని బాంబులతో పేల్చేస్తామని మంగళవారం రాత్రి ఓ ఫోన్ కాల్ రావటంతో అధికారుల్ని పరుగులు తీయించింది. వెంటనే అప్రమత్తమైన పోలీసుల బలగాలు సీఎం ఇంటి పరిసరాల్లో క్షుణ్ణంగా సోదాలు చేశారు.

భద్రతను పెంచారు. వేలూరు ప్రచార పర్యటన సందర్భంగా సీఎం కాన్వాయ్‌ వైపు ఓ కారులో తుపాకీ, నాటు బాంబులు బయటపడిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తంగానే వ్యవహరించారు. సోదాల తర్వాత ఇది కేవలం బెదిరింపు కాల్‌గా తేలింది. కంట్రోల్‌రూమ్‌కు వచ్చిన సెల్‌ నంబర్‌ ఆధారంగా సైబర్‌ క్రైం వర్గాలు తిరుప్పూర్‌కు చెందిన ఓ యువకుడ్ని బుధవారం అరెస్టు చేసి విచారిస్తున్నారు.