Prayagraj Clash: ప్రయాగ్‌రాజ్ హింస.. నిందితుడి ఇంటి కూల్చివేతకు సిద్దం

మొహమ్మద్ జావెద్ అనే వ్యక్తి హింసకు ప్రధాన కారకుడిగా గుర్తించారు పోలీసులు. దీంతో అతడిపై చర్య తీసుకునేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ప్రయాగ్‌రాజ్ డెవలప్‌మెంట్ అథారిటీ (పీడీఏ) ఆధ్వర్యంలో జావెద్ ఇంటికి అధికారులు నోటీసులు ఇచ్చారు.

Prayagraj Clash: మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యల నేపథ్యంలో గత శుక్రవారం దేశంలోని అనేక ప్రాంతాల్లో హింస చెలరేగిన సంగతి తెలిసిందే. ఉత్తర ప్రదేశ్‌లోని అనేక ప్రాంతాల్లో ఘర్షణలు జరిగాయి. వాటిలో ప్రయాగ్‌రాజ్ ఒకటి. ఇక్కడ కూడా ఆందోళనకారులు హింసకు పాల్పడ్డారు. దీంతో ప్రభుత్వం ఘర్షణకు పాల్పడ్డవారిపై కఠిన చర్యలకు సిద్ధమైంది.

Jubilee Hills Rape Case: నేడూ కొనసాగనున్న నిందితుల విచారణ

మొహమ్మద్ జావెద్ అనే వ్యక్తి హింసకు ప్రధాన కారకుడిగా గుర్తించారు పోలీసులు. దీంతో అతడిపై చర్య తీసుకునేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ప్రయాగ్‌రాజ్ డెవలప్‌మెంట్ అథారిటీ (పీడీఏ) ఆధ్వర్యంలో జావెద్ ఇంటికి అధికారులు నోటీసులు ఇచ్చారు. ప్రయాగ్‌రాజ్ నగరంలోని అటాలా ఏరియాలో ఉన్న అతడి ఇల్లు అక్రమ కట్టడమని గత నెల 5న నోటీసులు ఇచ్చారు. ఈ షోకాజ్ నోటీస్‌కు జావెద్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందనా రాలేదు. దీంతో ఇంటిని ఖాళీ చేయాల్సిందిగా అధికారులు తాజాగా మరో నోటీసు ఇచ్చారు. ఆదివారం ఉదయం పదకొండు గంటల లోపు ఇంటిని ఖాళీ చేయాలని సూచించారు. లేకుంటే చర్యలు తీసుకుంటామని నోటీసులో పేర్కొన్నారు.

COVID-19: వరుసగా రెండోరోజు ఎనిమిది వేలు దాటి కరోనా కేసులు

ఇప్పటివరకు జావెద్ కుటుంబం నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో అతడి ఇంటిని కూల్చేయాలని అధికారులు నిర్ణయించారు. దీనికోసం బుల్డోజర్లను అధికారులు సిద్దం చేశారు. జావెద్ ఉండే అటాలా ఏరియా చాలా సెన్సిటివ్ ఏరియా. గత శుక్రవారం ఈ ప్రాంతంలోనే అల్లర్లు జరిగాయి. కాగా, ప్రయాగ్‌రాజ్ హింస ఘటనలో 68 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు