Jubilee Hills Rape Case: నేడూ కొనసాగనున్న నిందితుల విచారణ

జూబ్లీహిల్స్ అత్యాచార ఘటనలో ఆరుగురు నిందితుల కస్టడీ విచారణ కొనసాగుతోంది. ఐదుగురు నిందితులతోపాటు, మరో మేజర్‌ను జూబ్లీహిల్స్ పోలీసులు విచారిస్తున్నారు. బంజారాహిల్స్ ఏసీపీ సుదర్శన్ విచారణాధికారిగా కొనసాగుతున్నారు.

Jubilee Hills Rape Case: నేడూ కొనసాగనున్న నిందితుల విచారణ

Jubilee Hills Rape Case

Updated On : June 12, 2022 / 8:10 AM IST

Jubilee Hills Rape Case: జూబ్లీహిల్స్ అత్యాచార ఘటనలో ఆరుగురు నిందితుల కస్టడీ విచారణ కొనసాగుతోంది. ఐదుగురు నిందితులతోపాటు, మరో మేజర్‌ను జూబ్లీహిల్స్ పోలీసులు విచారిస్తున్నారు. బంజారాహిల్స్ ఏసీపీ సుదర్శన్ విచారణాధికారిగా కొనసాగుతున్నారు. కస్టడీ విచారణలో పలు కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నట్లు సమాచారం. శనివారం ముగ్గురు మైనర్, ఒక మేజర్ నిందితుడి నుంచి అధికారులు కీలక సమాచారాన్ని రాబట్టారు. వీళ్లను దాదాపు గంటసేపు విచారించారు. పబ్‌లో బాలికను పరిచయం చేసుకున్నప్పటి నుంచి తనను ట్రాప్‌లోకి దించడం, అనంతరం అత్యాచార ఘటన.. మరుసటి రెండు రోజుల వరకు అసలు ఏం జరిగింది? ఎక్కడికి వెళ్లారు? ఎవరి సహాయంతో తెలంగాణ దాటారు? వంటి అంశాల్లో ప్రధానంగా విచారణ సాగింది.

Janasena Pawan : జనసేనాని దారెటు? వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతో జనసేన పొత్తు?

కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఏ1 సాదుద్దీన్ మాలిక్ కస్టడీ నేటితో ముగియనుంది. ఈ రోజు కూడా సాదుద్దీన్‌ను విచారించనున్నారు. ఏ2, ఏ3, ఏ4లుగా ఉన్న ముగ్గురు మైనర్ నిందితులను నేడు మూడవ రోజు విచారిస్తారు. మిగిలిన ఇద్దరు ఏ5, ఏ6 నిందితులను కూడా నేడు కస్టడీలో రెండవ రోజు విచారిస్తారు.