నిర్మాత బన్నీ వాసు ఇంట విషాదం..

Bunny Vasu Brother Passes away: నిర్మాత బన్నీ వాసు ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. బన్నీ వాసు సోదరుడు గవర సురేష్ అకాల మరణం చెందారు. కిడ్నీలు ఫెయిలవ్వడంతో బెంగుళూరులోని ప్రైవేటు హాస్పిటల్లో చేరగా, చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందారు. సురేష్‌కు భార్య, ఓ కుమారుడు ఉన్నారు.
పాలకొల్లుకు చెందిన గవర సూర్యనారాయణకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. కుమారులలో ఒకరు తెలుగు సినీ పరిశ్రమలో విజయవంతమైన నిర్మాతగా (బన్నీ వాసు) వెలుగొందుచుండగా, పెద్దకుమారుడు సురేష్ ఇంజనీరింగ్ చదివి ఆటోమొబైల్ ఇండస్ట్రీకి సంబంధించిన ఇంజనీర్లలో టాప్ 4లో ఒకరిగా ఉన్నారు.
డీజిల్, పెట్రోలు 4 వీలర్ వెహికల్‌లను సీఎన్‌జీ (కంప్రెసర్,నేచురల్ గ్యాస్) లోకి కన్వెర్షన్ చేసే కిట్స్ తయారీ కంపెనీ స్థాపించి అగ్రగణ్యునిగా ఎదిగారు. ఈ క్రమంలో ఆయన అకాల మరణం కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టేసింది. సురేష్ మృతి పట్లు పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేశారు.