Nairobi prison fire : బురిండి జైలులో భారీ అగ్నిప్రమాదం.. 38 మంది ఖైదీల సజీవ దహనం

బురిండీలోని జైలులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 38మంది ఖైదీలు సజీవ దహనమయ్యారు. మరో 60మంది తీవ్రంగా గాయపడ్డారు.

Fire accident in prison.. dead 38  : ఆఫ్రికా దేశం బురిండీలోని జైలులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఏకంగా 38మంది ఖైదీలు సజీవ దహనమైన ఘటన బురిండి రాజధాని గితెగాలో సంభవించింది.
బురుండి రాజధాని గితెగాలోని ప్రధాన జైలులో మంగళవారం (డిసెంబర్ 7,2021) జరిగిన అగ్నిప్రమాదంలో 38 మంది ఖైదీలు మరణించగా..మరో 69మంది ఖైదీలు తీవ్రంగా గాయపడ్డారని బురిండి దేశ ఉపాధ్యక్షుడు తెలిపారు. నిజానికి ప్రమాదం సంభవించిన ఈ జైలులో 400 ఖైదీలు ఉండగలిగే సామర్థ్యం ఉండగా.. 1,539 మంది మందికిపైగా ఖైదీలను ఉంచారు. ఫలితంగా ప్రమాదం జరిగిన సమయంలో తప్పించుకోవటానికి వీల్లేని కారణంగానే మృతుల సంఖ్య ఇంత భారీగా ఉందని తెలుస్తోంది.

Read more : Gang war in Prison: జైలులో గ్యాంగ్‌ వార్‌..116కు చేరిన మృతులు

ఖైదీలందరు నిద్రపోతున్న సమయంలో మంగళవారం తెల్లవారుజామున 4.00 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. జైలు నుంచి బయటకు వెళ్లలేని ఖైదీలు సజీవ దహనమయ్యారని వైస్ ప్రెసిడెంట్ ప్రాస్పర్ బజోంబాంజా తెలిపారు. మృతి చెందిన ఖైదీల్లో చాలావరకు వృద్ధులే ఉన్నట్లుగా సమాచారం.ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలు ఆర్పేందుకు శతవిధాలా యత్నించినా మరణాల సంఖ్య ఎక్కువగానే జరిగింది. స్థానిక పోలీసులు మిలటరీ సహాయంతో సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని పోలీసులు.. ఆర్మీ పికప్ ట్రక్కులలో ఆసుపత్రికి తరలించారు.

ఈ సంఘటనపై అధికారులెవరు వివరాలు వెల్లడించడానికి నిరాకరించారని స్థానిక మీడియా చెబుతోంది. కానీ మంటలు భారీగా ఎగిసిపడటం కళ్లారా చూసినా తప్పించుకోటానికి ప్రాణాలతో బయటపడటానికి ఎంతగానో యత్నించినా చాలామంది చనిపోయారని ప్రత్యక్ష్యంగా చూసిన ఓ ఖైదీ తెలిపాడు. కళ్లముందే వారు చనిపోతున్నా..మంటలకు ఆహుతి అయిపోతున్నా..ఎవరికి వారు ప్రాణాలతో బయటపడటానికే యత్నించామని అంతకుమించి ఏమీ చేయలేకపోయామని కరడు కట్టిన ఖైదీలు కూడా కన్నీటితో చెబుతున్నారు.

Read more : Corona Cases : దేశంలో పెరిగిన కరోనా కేసులు.. వేగంగా కొనసాగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియ

కాని పోలీసులు మా క్వార్టర్స్ తలుపులు తెరవడానికి నిరాకరించారని ప్రత్యక్ష సాక్షి అయిన ఓ ఖైదీ వాపోయాడు. నేను ఎలాగో తప్పించుకున్నాను..కానీ మా కళ్లముందే మంటల్లో కాలిపోయారని వాపోయాడు. ప్రమాదం జరిగినా..అధికారుల నిర్లక్ష్యం వల్ల ఎక్కువ మంది చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్రంగా గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించగా, స్వల్పంగా ఉన్న మరికొందరికి చికిత్స అందిస్తున్నారు.ఈ ప్రమాదానికి కారణం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అని అంతర్గత మంత్రిత్వ శాఖ ట్విట్టర్‌లో పేర్కొంది. బురిండిలోని ఈ జైలు 100 ఏళ్లనాటిది. కాగా..తీవ్రంగా కాలిపోవటంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశమున్నట్లుగా తెలుస్తోంది.

ట్రెండింగ్ వార్తలు