CM KCR Meet: ఎంపీలతో కేసీఆర్ కీలక సమావేశం.. కేంద్రాన్ని ఇరుకునపెట్టేలా వ్యూహరచన!

తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకుంటూ మళ్లీ ఎన్నికల సమయానికి టీఆర్ఎస్ బలం పెంచుకుని జనాల్లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు.

CM KCR Meet: ఎంపీలతో కేసీఆర్ కీలక సమావేశం.. కేంద్రాన్ని ఇరుకునపెట్టేలా వ్యూహరచన!

Kcr

CM KCR Meet: తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకుంటూ మళ్లీ ఎన్నికల సమయానికి టీఆర్ఎస్ బలం పెంచుకుని జనాల్లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. రాబోయే రోజుల్లో కేంద్రంపై పోరాటంతో ప్రజల్లోకి ఎలా వెళ్లాలి అనే విషయంపై అంచనాలు వేస్తున్నారు. ఈ క్రమంలోనే కేంద్రాన్ని ఇరుకునపెట్టేలా వ్యూహరచన చేస్తున్నారు.

ఆహారధాన్య సేకరణలో కేంద్రం అనుసరిస్తున్న విధానాన్ని తప్పుబడుతూ ఇప్పటికే టీఆర్ఎస్ ధర్నాలు నిర్వహించింది. అయోమయ అస్పష్ట విధానం అనుసరిస్తున్న కేంద్రంపై పార్లమెంట్‌లో కూడా పోరాటం చెయ్యాలంటూ టీఆర్ఎస్ ఇప్పటికే ఎంపీలకు దిశానిర్దేశం చేసింది. దీంతో పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కూడా టీఆర్ఎస్ ఎంపీలు తీవ్ర నిరసన, ఆందోళన నిర్వహించారు.

లోక్‌సభ, రాజ్య సభల్లో స్పీకర్ పోడియం ముందు నినాదాలు చేస్తూ కేంద్రానికి నిరసన తెలియజేశారు. ధాన్యం కొనుగోలు అంశంపై చర్చించాలని పలుమార్లు వాయిదా తీర్మాణాలను కూడా ఇచ్చారు. తమ మాట వినట్లేదంటూ పార్లమెంటును కూడా టీఆర్ఎస్ బహిష్కరించింది. ఈ చర్యతో కేంద్రంపై ఒత్తిడి పెరుగుతుందని టీఆర్ఎస్ భావిస్తోంది.

Tiruppavai : డిసెంబరు 17వ తేదీ నుండి సుప్రభాతం స్థానంలో తిరుప్పావై

ఈ క్రమంలోనే టీఆర్ఎస్ ఎంపీలు ఇవాళ, రేపు ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సమావేశం కానున్నారు. పార్లమెంట్‌‍లో పరిణామాలపై ఎంపీలు సీఎం కేసీఆర్‌కు ఈ సమావేశంలో వివరించనున్నారు. ఈ సమావేశంలోనే ధాన్యం కొనుగోలు అంశంపై భవిష్యత్ కార్యాచరణ సిద్ధం చేసే అవకాశం కనిపిస్తుంది. పార్లమెంట్ సమావేశాలను బహిష్కరించినా పార్లమెంట్ బయట నిరసన తెలియజేసే విషయమై సీఎం కేసీఆర్‌తో మీటింగ్‌లో నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. క్షేత్రస్థాయిలో రైతుల వద్దకు వెళ్లేందుకు కూడా టీఆర్ఎస్ పార్టీ నేతలు, మంత్రులు సిద్ధం అవుతున్నారు.

కేంద్ర ప్రభుత్వ విధానాలను రైతులకు వివరించనున్న టిఆర్ఎస్ శ్రేణులు

Road Accident: కావలిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి