Bypolls In India 2021: దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు:3 లోక్‌సభ, 29 అసెంబ్లీ స్థానాల్లో కొనసాగుతున్న పోలింగ్

దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరుగతున్నాయి. 3 లోక్‌సభ, 29 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకే ప్రారంభమైన పోలింగ్ కేంద్రాల వద్ద ఓట్లు బారులు తీరారు.

Bypolls In India 2021: దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు:3 లోక్‌సభ, 29 అసెంబ్లీ స్థానాల్లో కొనసాగుతున్న పోలింగ్

Bypolls In India 2021

Updated On : October 30, 2021 / 12:11 PM IST

Bypolls In India 2021 :  తెలంగాణలోని హుజూరాబాద్ లో ఎన్నిక కొనసాగుతోంది. ఈక్రమంలో మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఉప ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. అలా దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతంలో ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. దీంట్లో భాగంగా కేంద్రపాలిత ప్రాంతమైన దాద్రా నగర్‌ హవేళి, డామన్‌ డయ్యూలో ఉపఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పరిధిలో మొత్తం 3 లోక్‌సభ, 29 అసెంబ్లీ స్థానాలకు శనివారం (అక్టోబర్ 30,2021) ఉప ఎన్నిక పోలింగ్‌ జరుగుతోంది. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ కేంద్రాలకు ఉదయం నుంచే ఓటర్లు ఆయా పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఈ పోలింగ్‌ రాత్రి 7 గంటలకు కొనసాగనుంది.

Read more : Huzurabad By Election : హుజూరాబాద్ ఉపఎన్నిక..డబ్బులు ఇస్తేనే ఓట్లు వేస్తామంటున్న ఓటర్లు..

దేశంలో ఎన్నికలు జరుగుతున్న స్థానాలు ఇవే..
కేంద్రపాలిత ప్రాంతమైన దాద్రానగర్‌ హవేలీ, హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి, మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా లోక్‌సభ స్థానానికి ఉపఎన్నికలు జరగుతుండగా.. 29 అసెంబ్లీ నియోజకవర్గాలలో అసోంలో 5 (గోస్సైగావ్, భబానీపూర్, తముల్పూర్, మరియాని,తౌరా), పశ్చిమ బెంగాల్‌లో 4 (దిన్‌హటా, శాంతిపూర్, ఖర్దా మరియు గోసాబా), మధ్యప్రదేశ్‌లో 3 (జోబాట్, రాయ్‌గావ్ మరియు పృథ్వీపూర్), మేఘాలయలో 3 (రాజబాలా, మావ్రింగ్‌నెంగ్ మరియు మావ్‌ఫ్లాంగ్), హిమాచల్‌ప్రదేశ్‌లో 3 (అర్కి, ఫతేపూర్ మరియు జుబ్బల్-కోట్‌ఖాయ్), బీహార్‌లో2 (తారాపూర్ మరియు కుశేశ్వర్), కర్ణాటకలో2 (హనగల్ మరియు సింద్గి) , రాజస్థాన్‌లో 2 (వల్లభనగర్ మరియు ధరియావాడ్), మహారాష్ట్ర (డెగ్లూర్), హర్యానా, మిజోరంలో (తురియాల్) ఒక్కో స్థానానికి, తెలంగాణలోని హుజురాబాద్‌, ఆంధ్రప్రదేశ్‌లోని బద్వేల్‌ అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగుతున్నాయి. ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు నవంబర్ 2న ఓట్ల జరగనుంది.