RRR: బాహుబలిని మించే సత్తా RRRకు నిజంగా ఉందా..?

ప్రస్తుతం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూవీ ఆర్ఆర్ఆర్ మరో నాలుగు రోజుల్లో మనముందుకు రాబోతుంది. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్.రాజమౌళి.....

Can Rrr Really Beat Baahubali Craze At Box Office

RRR: ప్రస్తుతం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూవీ ఆర్ఆర్ఆర్ మరో నాలుగు రోజుల్లో మనముందుకు రాబోతుంది. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్.రాజమౌళి తనదైన మార్క్‌తో తెరకెక్కించడంతో ఈ చిత్రాన్ని చూసేందుకు ఆడియెన్స్ ఎంతో ఆతృతగా వెయిట్ చేస్తూ వచ్చారు. ఇక ఈ సినిమా పలుమార్లు రిలీజ్‌ను వాయిదా వేసుకోగా ఎట్టకేలకు మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో ఏర్పడ్డాయి.

అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌ను భారీ ఎత్తున నిర్వహిస్తున్న చిత్ర యూనిట్, ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. దేశవ్యాప్తంగా ఈ సినిమా ప్రమోషన్స్‌లో చిత్ర యూనిట్ ఫుల్ బిజీగా ఉంది. ఈ క్రమంలో చిత్ర దర్శకుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ రేంజ్‌ను హైలైట్ చేస్తూ ఈ చిత్రంపై చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చర్చనీయాంశంగా మారాయి. ఈ సినిమా బాహుబలి కంటే చాలా పెద్ద సినిమా అని.. ఈ సినిమా అన్ని రికార్డులను తిరగరాయడం ఖాయమని ఆయన అన్నారు. అయితే ఈ కామెంట్స్‌తో ప్రభాస్ ఫ్యాన్స్ జక్కన్నపై సీరియస్ కామెంట్స్ చేస్తున్నారు.

RRR: తెలుగులో లేనిది హిందీలో ఏముంది?

అసలు బాహుబలి ఎక్కడ.. ఆర్ఆర్ఆర్ చిత్రం ఎక్కడా.. అంటూ వారు కామెంట్ చేస్తున్నారు. బాహుబలి చిత్రం ఓ విజువల్ వండర్ అని.. ఆర్ఆర్ఆర్ కేవలం ఓ పీరియాడికల్ సబ్జెక్ట్‌కు ఫిక్షన్ యాడ్ చేసిన సినిమా అని వారు సోషల్ మీడియా వేదికగా అంటున్నారు. ఇక బాహుబలి రికార్డులను ఆర్ఆర్ఆర్ తిరగరాస్తుందని జక్కన్న స్వయంగా అనడం ఏమాత్రం నమ్మశక్యంగా లేదని వారు అంటున్నారు. ముఖ్యంగా బాహుబలి చిత్రం రెండు భాగాలుగా వచ్చినప్పటికీ, సెకండ్ పార్ట్ కోసం యావత్ ప్రపంచం ఎంత ఆసక్తిగా ఎదురుచూసిందో అందరికీ తెలుసని, కానీ ఆర్ఆర్ఆర్ పరిస్థితి అలా లేదని డార్లింగ్ ఫ్యాన్స్ అంటున్నారు.

Rajamouli : అల్లూరి క్యారెక్టర్‌కి చెర్రీని, కొమరం భీం క్యారెక్టర్‌కి తారక్‌నే ఎందుకు తీసుకున్నానంటే?

ఏ అంశంపై RRR చిత్రం బాహుబలిని బీట్ చేస్తుందని జక్కన్న అన్నాడో క్లారిటీ ఇవ్వాలని ప్రభాస్ ఫ్యాన్స్ కోరుతున్నారు. అయితే RRR లాంటి సినిమాలు రావాలని తాము కూడా కోరుతున్నామని, అది టాలీవుడ్ స్థాయిని మరింత ముందుకు తీసుకెళ్లేలా ఉండాలని వారు అంటున్నారు. ఇక రామ్ చరణ్, ఎన్టీఆర్ అభిమానులు ప్రభాస్ ఫ్యాన్స్ చేస్తున్న నెగెటివ్ కామెంట్స్‌ను ఏమాత్రం పట్టించుకోవాల్సిన అవసరం లేదని, RRR సరికొత్త హిస్టరీని క్రియేట్ చేయడం ఖాయమని.. కాలమే సరైన సమాధానం చెబుతుందని వారు అంటున్నారు. మరి ఈ ఫ్యాన్ వార్ ఇంకా ఎంతవరకు వెళ్తుందో చూడాలి అంటున్నారు సినీ ఎక్స్‌పర్ట్స్.