RRR: తెలుగులో లేనిది హిందీలో ఏముంది?

టాలీవుడ్ ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ మరొక నాలుగు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయింది.....

RRR: తెలుగులో లేనిది హిందీలో ఏముంది?

Two Different Run Time For Telugu And Hindi Versions Of Rrr

RRR: టాలీవుడ్ ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ మరొక నాలుగు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయింది. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీలో రామ్ చరణ్, ఎన్టీఆర్‌లు కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఎదురుచూస్తుంటే, ఇక ఈ సినిమా ప్రమోషన్స్‌తో చిత్ర యూనిట్ ఫుల్ బిజీగా ఉన్నారు. సెన్సార్ పనులు కూడా ముగించుకున్న ఆర్ఆర్ఆర్ చిత్ర రన్‌టైమ్ ఇప్పుడు ఆడియెన్స్‌ను తికమక పెడుతోంది.

RRR: టికెట్ల ధర పెంపు.. తెలుగు రాష్ట్రాల సీఎంలకు దానయ్య కృతజ్ఞతలు

ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా చిత్ర యూనిట్ రిలీజ్ చేస్తోన్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాకు తెలుగులో 3 గంటల 02 నిమిషాల రన్‌టైమ్‌ను చిత్ర యూనిట్ లాక్ చేసింది. అయితే ఇదే సినిమాను హిందీలో 3 గంటల 07 నిమిషాల నిడివితో రిలీజ్ చేయనున్నారు. దీంతో ఈ 5 నిమిషాల తేడా ఎందుకు ఉందా అని వారు ఆలోచిస్తున్నారు.

తెలుగులో లేని ఏ అంశాన్ని హిందీ భాషలో చూపించబోతున్నారా అని వారు ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ 5 నిమిషాల నిడివిలో ఎలాంటి సీక్వెన్స్‌ను జక్కన్న ప్లాన్ చేశాడా.. దాన్ని తెలుగు ఆడియెన్స్‌కు ఎందుకు చూపిండం లేదా అని వారు ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా తెలుగులో లేని ఈ 5 నిమిషాల నిడివిలో ఏదో కంటెంట్ ఖచ్చితంగా ఉండే ఉంటుందని అభిమానులు అంటున్నారు. అందుకే హిందీలో వర్షన్‌లో ఉన్న ఈ 5 నిమిషాల సీన్స్ ఏమిటో చూడాలని వారు కోరుకుంటున్నారు.

RRR : గ్యాస్ సిలిండర్ తీసుకోండి.. ‘ఆర్ఆర్ఆర్’ టికెట్లు ఫ్రీగా పొందండి

ఇక చరణ్ అల్లూరి సీతారామారాజుగా, తారక్ కొమురం భీం పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా టికెట్ బుకింగ్స్ కూడా రికార్డు స్థాయిలో జరుగుతుండటంతో వసూళ్లు కూడా రికార్డ్ స్థాయిలో రాబట్టడం ఖాయమని చిత్ర వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి ఆర్ఆర్ఆర్ చిత్రం ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో తెలియాలంటే మరో నాలుగు రోజులు ఆగాల్సిందే.