RRR: టికెట్ల ధర పెంపు.. తెలుగు రాష్ట్రాల సీఎంలకు దానయ్య కృతజ్ఞతలు

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కించిన సినిమా ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమా మార్చి 25న థియేటర్లలలో విడుదల కానుంది. 'ఆర్ఆర్ఆర్' మూవీని..

RRR: టికెట్ల ధర పెంపు.. తెలుగు రాష్ట్రాల సీఎంలకు దానయ్య కృతజ్ఞతలు

Rrr (3)

RRR: యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కించిన సినిమా ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమా మార్చి 25న థియేటర్లలలో విడుదల కానుంది. ‘ఆర్ఆర్ఆర్’ మూవీని ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తుండగా.. ఇందుకోసం చిత్ర బృందం ప్రమోషన్స్ భారీగా నిర్వహిస్తుంది. అంతకుముందే సినిమాకి టికెట్ రేట్ల పెంపు కోసం చిత్ర నిర్మాత దానయ్య, డైరెక్టర్ రాజమౌళి ఇటీవల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిసి సంప్రదింపులు జరిపారు. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఆర్ఆర్ఆర్ సినిమా టికెట్ల ధరల పెంపును అనుమతినిస్తూ ఉత్తర్వులు ఇచ్చాయి.

RRR: ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. హాట్ టాపిక్‌గా మారిన జెండాలు!

దీనిపై ఇప్పటికే ఆర్ఆర్ఆర్ బృందం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, మంత్రులకు కృతజ్ఞతలు తెలపగా ఆర్ఆర్ఆర్ నిర్మాత డీవీవీ దానయ్య మరోసారి కృతజ్ఞతలు తెలిపారు. శనివారం కర్ణాటకలోని చిక్బల్లాపూర్ లో ఆర్ఆర్ఆర్ ప్రీరిలీజ్ ఈవెంట్ భారీగా నిర్వహించారు. ఈ వేడుకలో మాట్లాడిన నిర్మాత దానయ్య ట్రిపుల్ ఆర్ మూవీ టిక్కెట్ రెట్లు పెంచుకొనే విధంగా అనుమతి ఇచ్చిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

RRR: 1000 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్.. ఫస్ట్ డే రూ.150 కోట్ల టార్గెట్!

మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో కూడా టిక్కెట్ రెట్లు పెంచుకొనే విధంగా అనుమతి ఇచ్చిన తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కి ధన్యవాదములు తెలిపారు. ఏపీ మంత్రలు పేర్ని నానీ, కొడాలి నానీకి, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ కి కూడా కృతజ్ఞతలు తెలిపారు. ఇక ఏపీలో టిక్కెట్ రెట్లు పెంచుకోవడానికి ఇండస్ట్రీ తరుపున చిరంజీవి ఎంతో కృషి చేశారని.. అందుకు చిరంజీవికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.