RRR: 1000 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్.. ఫస్ట్ డే రూ.150 కోట్ల టార్గెట్!

మార్చ్ 25 వరకు ప్రమోషన్స్ తప్ప మరే పని పెట్టుకోలేదు ట్రిపుల్ ఆర్ టీమ్. గ్యాప్ దొరికితే ఇంటర్వ్యూస్.. ప్లాన్ ప్రకారం ఈవెంట్స్.. ఈ రేంజ్ లో వాళ్ల కెరీర్ లోనే చరణ్, తారక్ ప్రమోషన్స్..

RRR: 1000 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్.. ఫస్ట్ డే రూ.150 కోట్ల టార్గెట్!

RRR

RRR: మార్చ్ 25 వరకు ప్రమోషన్స్ తప్ప మరే పని పెట్టుకోలేదు ట్రిపుల్ ఆర్ టీమ్. గ్యాప్ దొరికితే ఇంటర్వ్యూస్.. ప్లాన్ ప్రకారం ఈవెంట్స్.. ఈ రేంజ్ లో వాళ్ల కెరీర్ లోనే చరణ్, తారక్ ప్రమోషన్స్ చేసుండరు. అంతలా రెస్ట్ లేకుండా ట్రిపుల్ ఆర్ ను ప్రమోట్ చేయిస్తున్నారు రాజమౌళి. నిజమే.. 1000 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ చేసిన సినిమా అంటే మాటలా.. అంతకు మించి అన్న రేంజ్ లో కలెక్షన్స్ రాబట్టాలంటే ఈ తిప్పలు తప్పవు మరి.

RRR: ప్రీ-రిలీజ్ ఈవెంట్ గెస్ట్ ఎవరో చెప్పేసిన జక్కన్న

ఎమోషన్స్, ఎలివేషన్స్, ఎంటర్ టైన్ మెంట్.. ప్రీరిలీజ్ ప్రమోషన్స్ లోనే దడదడలాడిస్తున్నారు ఆర్ఆర్ఆర్.. రాజమౌళి, రామ్ చరణ్, రామారావ్. రిలీజ్ డేట్ మార్చ్ 25 వరకు ఆడియెన్స్ సైడ్ ట్రాక్ అవకుండా కావాల్సినంత బజ్ క్రియేట్ చేస్తున్నారు. రీసెంట్ గా దుబాయ్ లో ల్యాండ్ అయి అక్కడివారిని ఫుల్ గా ఎంగేజ్ చేశారు. ప్యాన్ వరల్డ్ రేంజ్ లో హిట్ కొట్టాలని చూస్తోన్న జక్కన్న.. అక్కడ నుండి టార్గెట్ లిస్ట్ లో బెంగళూర్, బరోడా, ఢిల్లీ, అమృత్ సర్, జైపూర్, కోల్ కతా, వారణాసి సిటీస్ ఉన్నాయి.

RRR: సెంచరీ కొట్టిన ఆర్ఆర్ఆర్.. ఆలస్యమైనా తగ్గని క్రేజ్!

1000 కోట్లకు పైగా ప్రీరిలీజ్ బిజినెస్ చేసిన ట్రిపుల్ ఆర్ కోసం ఈ రేంజ్ లో కష్టపడితే కానీ, వరుస ప్రమోషన్స్ తో హీరోలకు చెమటలు పట్టిస్తే కానీ సూపర్ కమర్షియల్ హిట్ సాధ్యమవుతుందనేది జక్కన్న ప్లాన్. ఎలాగూ యూస్, యూకే లాంటి ఫారెన్ కంట్రీస్ లో రామ్ చరణ్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ దూకుడుగా తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. రిలీజ్ కు కొన్ని రోజుల ముందే టాప్ నాచ్ అడ్వాన్స్ బుకింగ్ తో రికార్డ్ కొట్టేస్తున్నారు. దేశం కాని దేశంలో సైతం తారక్, చరణ్ కటౌట్స్, ఫ్లెక్సీలు, స్పెషల్ వీడియోస్ తో రెచ్చిపోతున్నారు.

RRR: ఆర్ఆర్ఆర్‌లో ఇంటర్వెల్ బ్యాంగ్ ఇదేనా..?

ఓవర్సీస్ లోనే ఫ్యాన్స్ సందడి అలా ఉంటే పాన్ ఇండియా లెవెల్ లో అది అంతకుమించి అన్నట్టుంది. ఒక్క ఏపీలోనే 110 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసిన ట్రిపుల్ ఆర్.. పెరిగిన టికెట్ రేట్ ప్రకారం కనీసం 5 రోజులు హౌస్ ఫుల్ బోర్డులు పడ్డా 100 కోట్లను రాబట్టడం పక్కా. ఇక తెలంగాణ సంగతి సరేసరి. నైజాం ఏరియాలో 80కోట్ల థియేట్రికల్ లెక్కలు చూపిస్తోన్న జక్కన్న.. తమిళనాడు, కేరళ, కర్ణాటక కలుపుకొని 120 కోట్లను క్రాస్ చేశారు. సౌత్ మొత్తంతో పాటూ నార్త్ ఆడియెన్స్ సైతం అంతే ఈగర్ గా మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు. అందుకే ఫస్ట్ డేనే వరల్డ్ వైడ్ 150 కోట్ల లక్ష్యంతో బరిలోకి దూకుతున్నారు జక్కన్న అండ్ టీమ్. దానికి తగ్గట్టే ప్రమోషన్స్ ను పీక్స్ కు తీసుకెళ్తున్నారు.