RRR: ప్రీ-రిలీజ్ ఈవెంట్ గెస్ట్ ఎవరో చెప్పేసిన జక్కన్న

ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ది మోస్ట్ వెయిటెడ్ మూవీ ఆర్ఆర్ఆర్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ మరికొన్ని గంటల్లో అంగరంగ....

RRR: ప్రీ-రిలీజ్ ఈవెంట్ గెస్ట్ ఎవరో చెప్పేసిన జక్కన్న

RRR

RRR: ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ది మోస్ట్ వెయిటెడ్ మూవీ ఆర్ఆర్ఆర్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ మరికొన్ని గంటల్లో అంగరంగ వైభవంగా జరగనుంది. గతంలోనే ఈ సినిమాకు సంబంధించి పలు వేడుకులు నిర్వహించి జనవరిలో చిత్రాన్ని రిలీజ్ చేయాలని చూసినా, కరోనా కారణంగా ఈ సినిమాను వాయిదా వేశారు చిత్ర యూనిట్.

RRR Pre- Release Event : జక్కన్న ప్లాన్ అదిరిందిగా

ఇక ఇప్పుడు ఈ సినిమాను మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో మార్చి 19న సాయంత్రం 6 గంటలకు ప్రారంభం కానున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు తాజాగా చిత్ర యూనిట్ దుబాయ్‌లో చిత్ర ప్రమోషన్స్ ముగించుకుని బెంగళూరుకు కూడా చేరుకున్నారు. అయితే ఈ గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథి ఎవరనే విషయంపై మాత్రం చిత్ర యూనిట్ ఎలాంటి ప్రకటన చేయలేదు.

దీంతో సోషల్ మీడియాలో ఎవరికి తోచిన విధంగా వారే ఈ సినిమాకు పలానా గెస్టు వస్తున్నారంటూ వార్తలను వైరల్ చేశారు. కాగా తాజాగా RRR ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా ఎవరు వస్తున్నారనే విషయంపై చిత్ర దర్శకుడు జక్కన్న ఓ క్లారిటీ ఇచ్చేశాడు. ఈ ప్రీరిలీజ్ వేడుకకు స్వయంగా కర్ణాటక సీఎం బస్వరాజ్ బొమ్మై వస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

RRR: రీ ప్రమోషన్స్ జోరు.. అంచనాలు పెంచేస్తున్న ఆర్ఆర్ఆర్ టీమ్

RRR ప్రీరిలీజ్ ఈవెంట్ వేడుక బాధ్యతలను KVN ప్రొడక్షన్స్‌కు చెందిన వెంకట్‌కు అప్పగించగా, ఆయన దీనికి సంబంధించిన ఏర్పాట్లను అద్భుతంగా చేస్తున్నారంటూ జక్కన్న ఓ వీడియోలో పేర్కొన్నారు. దీంతో ఆర్ఆర్ఆర్ చీఫ్ గెస్ట్ ఎవరనే విషయం బట్టబయలయ్యింది. ఇక కర్ణాటక సీఎం ఈ ఈవెంట్‌కు వస్తుండటంతో భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు అక్కడి పోలీసులు. ఇక ఈ వేడుకకు పలువురు సినీ ప్రముఖులు కూడా హాజరు కానున్నట్లు తెలుస్తోంది.