RRR: రీ ప్రమోషన్స్ జోరు.. అంచనాలు పెంచేస్తున్న ఆర్ఆర్ఆర్ టీమ్

వాయిదాల మీద వాయిదాలు పడినా.. ఈనెల 25న రానున్న ట్రిపుల్ ఆర్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు పాన్ వరల్డ్ ఆడియన్స్. జక్కన్న ప్రమోషనల్ టెక్నిక్స్ తో ఆడియన్స్ ఎక్కడా డీవేట్ కాకుండా..

RRR: రీ ప్రమోషన్స్ జోరు.. అంచనాలు పెంచేస్తున్న ఆర్ఆర్ఆర్ టీమ్

Rrr

RRR: వాయిదాల మీద వాయిదాలు పడినా.. ఈనెల 25న రానున్న ట్రిపుల్ ఆర్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు పాన్ వరల్డ్ ఆడియన్స్. జక్కన్న ప్రమోషనల్ టెక్నిక్స్ తో ఆడియన్స్ ఎక్కడా డీవేట్ కాకుండా ఎంగేజ్ చేస్తున్నారు. మరి ఎక్స్ పెక్టేషన్స్ కి తగ్గట్టు బాహుబలి సిరీస్ కాదు అంతకు మించి అన్న లెవెల్ లో ట్రిపుల్ ఆర్ ఉండబోతుందా? రెగ్యులర్ ప్రమోషన్స్ తో రోజు రోజుకీ హైప్ పెరుగుతున్న ట్రిపుల్ ఆర్ పై హావ్ ఏ లుక్..

RRR: జక్కన్న స్పెషల్ ప్రమోషన్స్.. దుబాయ్ ఈవెంట్‌కు ఒలివియా మోరిస్!

ఫ్రీడమ్ ఫైటర్స్ దోస్తీ కడితే ఎలా ఉంటుంది అనే థాట్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన సినిమా ఆర్ఆర్ఆర్. టీజర్, ట్రయిలర్, సాంగ్స్ అన్నీ హై లెవెల్ స్టాండర్డ్స్ లో నే ఆకట్టుకున్నాయి. ఆల్రెడీ పీక్ ప్రమోషన్స్ తో సౌత్, నార్త్ ఇండియా మొత్తం కవర్ చేసిన జక్కన్న టీమ్, లేటెస్ట్ గా రీ ప్రమోషన్స్ జోరు చూపిస్తోంది. ఇప్పుడు కూడా లార్జ్ స్కేల్ లోనే ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ప్లాన్ చేశారు. ఇంత భారీ సినిమా చేసిన ఆర్ఆర్ఆర్ టీమ్, లేటెస్ట్ గా అనిల్ రావిపూడితో ఇంటర్యూలో చిన్న పిల్లలైపోయారు. చాలా ఫన్ జనరేట్ చేసి, ఆడియన్స్ ను ఆకట్టుకున్నారు.

RRR: ఆర్ఆర్ఆర్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు గెస్టులు వారే..?

ఈ ఇంటర్వ్యూలో చరణ్, తారక్, సినిమా విశేషాలతో పాటు, వాళ్ల మధ్య రియల్ లైఫ్ దోస్తీ సీక్రెట్ ను రివీల్ చేశారు. ఇంకా పర్సనల్ ఫామిలీ మాటర్స్ షేర్ చేసుకున్నారు. జక్కన్న ఫామిలీతో ఈ స్టార్ హీరోల బాండింగ్, సినిమా సెట్లో రియల్ బిహేవియర్ పెర్ఫామెన్స్ తో సహా చూపించి, నాన్ స్టాప్ గా నవ్వించాడు తారక్. ఈ ఇంటర్వ్యూతో ఎంటర్టైన్ చేస్తూనే సినిమాపైన ఇంట్రెస్ట్ ను మరింత పెంచేశారు జక్కన్న టీమ్.

RRR : అమెరికాలో భారీగా ‘ఆర్ఆర్ఆర్’.. 1150 పైగా థియేటర్స్‌లో..

450 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ట్రిపుల్ ఆర్, బాహుబలి 2 కలెక్షన్స్ ను బీట్ చేసేలా మాస్టర్ ప్లాన్ వర్కవుట్ చేస్తున్నారు జక్కన్న. జస్ట్ యుఎస్ లోనే ఆల్రెడీ 1150 రికార్డ్ స్తాయి లొకేషన్స్ లో రిలీజ్ ఖాయం చేశారు. రిలీజ్ డేట్ వరకు ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఆంధ్రాలో కూడా టికెట్ రేట్లపై 100 రూపాయలు అదనంగా పెంచుకునే పర్మిషన్ తెచ్చుకున్నారు. తెలంగాణలో ఎలాగూ పెంచుకునే ఛాన్స్ ఉండనే ఉంది. ఇలా నేషనల్ వైడ్ తొలిరోజే 150 కోట్ల కలెక్షన్స్ రాబట్టాలనే లక్ష్యంతో రిలీజ్ కానున్న ఆర్ ఆర్ ఆర్ టార్గెట్ ఈజీగా రీచ్ అవుతుందనే అంచనాలున్నాయి.

RRR : ‘ఆర్ఆర్ఆర్’ దర్శక నిర్మాతలకు హైకోర్టులో ఊరట

ఆర్ఆర్ఆర్ పై గ్లోబల్ ఆడియన్స్ భారీ ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకున్నారు. రిలీజ్ కు ముందే అన్ని లాంగ్వేజెస్ థియేట్రికల్, డిజిటల్, శాటిలైట్ రైట్స్ తో కలుపుకుని 1000 కోట్ల బిజినెస్ చేసింది ట్రిపుల్ ఆర్. ఈ సినిమాలో అజయ్ దేవగన్, ఆలియా భట్ కామియో రోల్స్ అయినా కూడా స్టోరీ లో చాలా ఇంపార్టెన్స్ ఉంటుందన్నారు రాజమౌళి. వాటర్ అండ్ ఫైర్ సింబాలిజంతో ఇద్దరు స్టార్ హీరోలను డీల్ చేసి ఇద్దరికీ ఈక్వెల్ ఎంపతీ ఉండేలా బ్యాలెన్స్ చేసిన ఆర్ఆర్ఆర్ సినిమా అంటే పాన్ వరల్డ్ ఆడియన్స్ కి పండగే.