RRR: ఆర్ఆర్ఆర్‌లో ఇంటర్వెల్ బ్యాంగ్ ఇదేనా..?

మోస్ట్ వెయిటెడ్ మూవీగా వస్తున్న ఆర్ఆర్ఆర్ కౌంట్ డౌన్ మొదలయ్యింది. మరో వారంలో రోజుల్లో ఈ బొమ్మ వెండితెరపై కనిపించనుండటంతో.....

RRR: ఆర్ఆర్ఆర్‌లో ఇంటర్వెల్ బ్యాంగ్ ఇదేనా..?

This Sequence To Be Interval Bang In Rrr

RRR: మోస్ట్ వెయిటెడ్ మూవీగా వస్తున్న ఆర్ఆర్ఆర్‌కు కౌంట్‌డౌన్ మొదలయ్యింది. మరో వారంలో రోజుల్లో ఈ బొమ్మ వెండితెరపై కనిపించనుండటంతో ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ భారీ పీరియాడికల్ ఫిక్షన్ మూవీని దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తుండగా ఈ చిత్రంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్నారు.

దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్నాయి. ఈ చిత్రంలో తారక్ కొమురం భీం పాత్రలో నటిస్తుండగా, చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించనున్నారు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్‌లో చిత్ర యూనిట్ ఫుల్ బిజీగా ఉంది. ఇప్పటికే విశ్వవ్యాప్తంగా ఈ సినిమాను భారీ స్థాయిలో ప్రమోట్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్రణాళిక సిద్ధం చేసింది.

RRR : ‘ఆర్ఆర్ఆర్’ సరికొత్త రికార్డ్.. మొదటిసారి పలు ఆఫ్రికా దేశాల్లో తెలుగు సినిమా రిలీజ్

ఈ క్రమంలో సినిమాకు సంబంధించి పలు ఆసక్తికరమైన విషయాలను చిత్ర యూనిట్ ప్రేక్షకులతో పంచుకుంటూ వెళ్తోంది. అయితే ఈ సందర్భంలో RRR చిత్రంలోని ఇంటర్వెల్ బ్యాంగ్ గురించి కూడా చర్చ సాగింది. ఈ సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్ ఈ చిత్రానికే హైలైట్‌గా ఉండబోతుందని, ఇది మునుపెన్నడూ లేని విధంగా ప్రేక్షకులను కట్టిపడేస్తుందని చిత్ర యూనిట్ అంటోంది.

కాగా ఈ సినిమాలోని ఇంటర్వెల్ బ్యాంగ్ గురించి ఇటీవల దర్శకుడు అనిల్ రావిపూడి RRR టీమ్‌తో చేసిన ఇంటర్వ్యూలోనూ ప్రస్తావించారు. ఈ సినిమాలో హీరోలిద్దరి మధ్య ఓ భీకరపోరు ఉంటుందని.. అదే ఈ సినిమాలో కీలకంగా ఉండబోతుందని చిత్ర యూనిట్ తెలిపింది. కాగా అదే ఫైట్ సీక్వెన్స్ ఈ సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్‌గా ఉంటుందని వారు చేసిన సంభాషణ ఆధారంగా డిసైడ్ చేస్తున్నారు మూవీ లవర్స్.

RRR: రెండు భిన్న ధృవాలు.. చెలరేగిపోతున్న తారక్.. గుంభనంగా చరణ్!

మొత్తానికి హీరోలిద్దరి మధ్య అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్‌ను పెట్టి ఆ తరువాత సినిమాపై మరింత ఆసక్తిని క్రియేట్ చేయడం జక్కన్నకే సాధ్యమని ఆయన్ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. మరి ఈ సినిమాలో హీరోలు ఎందుకు కొట్టుకుంటారో తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే అంటున్నారు సినీ ఎక్స్‌పర్ట్స్.