RRR: రెండు భిన్న ధృవాలు.. చెలరేగిపోతున్న తారక్.. గుంభనంగా చరణ్!

మార్చ్ 25.. డేట్ దగ్గరపడుతున్న కొద్దీ ట్రిపుల్ ఆర్ ప్రమోషన్స్ పీక్స్ కు చేరుకుంటున్నాయి. ఇంకా ఇంకా నేషనల్ ఆడియెన్స్ ను ఎంగేజ్ చేసేలా జక్కన్న గీసిన కొత్త స్కెచ్.. నార్త్ మేకర్ మతి..

RRR: రెండు భిన్న ధృవాలు.. చెలరేగిపోతున్న తారక్.. గుంభనంగా చరణ్!

Rrr

RRR: మార్చ్ 25.. డేట్ దగ్గరపడుతున్న కొద్దీ ట్రిపుల్ ఆర్ ప్రమోషన్స్ పీక్స్ కు చేరుకుంటున్నాయి. ఇంకా ఇంకా నేషనల్ ఆడియెన్స్ ను ఎంగేజ్ చేసేలా జక్కన్న గీసిన కొత్త స్కెచ్.. నార్త్ మేకర్ మతి పోగొడుతోంది. అంతా బాగానే ఉంది కానీ ఈ హై రేంజ్ ప్రమోషన్స్ లో తారక్ చెలరేగిపోతుంటే.. చరణ్ ఎందుకు గుంభనంగా ఉంటున్నారు.. మిస్టర్ కూల్ మిస్టర్ సైలెంట్ గా అయిపోయారేందుకు అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

RRR: దుబాయ్-2020 ఎక్స్‌పోలో ఆర్ఆర్ఆర్ వేడుక.. సర్వం సిద్ధం!

రిలీజ్ డేట్ మార్చ్ 25న ఫిక్సయ్యాక అన్ని భాషల్లో మళ్లీ ప్రమోషనల్ ఇంటర్వ్యూలతో ఆడియెన్స్ ను హైజాక్ చేశారు జక్కన్న అండ్ టీమ్. ఇప్పుడు డైరెక్ట్ గా ఆడియెన్స్ ను పలకరించేందుకు కొత్త ప్లాన్ తో రెడీగా ఉన్నారు. ఈ శుక్రవారం నుంచి మార్చ్ 23 వరకు దేశవ్యాప్తంగా గ్యాప్ లేకుండా సందడి చేయబోతున్నారు. హైదరాబాద్ లో పలు కార్యక్రమాలు తర్వాత దుబాయ్ ఈవెంట్… ఈ తర్వాత వరుసగా బెంగళూర్, బరోడా, ఢిల్లీ, అమృత్ సర్, జైపూర్, కోల్ కతా, వారణాసి, మళ్ళీ హైదరాబాద్ ఇలా నేషనల్ వైడ్ ఆడియెన్స్ కు కనెక్టయ్యేలా నయా స్కెచ్ వర్కవుట్ చేస్తున్నారు.

RRR: ‘మహాప్రభో.. నన్ను వదిలేయండి’.. జక్కన్నకు దండం పెట్టిన తారక్!

ట్రిపుల్ ఆర్ హై రేంజ్ ప్రమోషన్స్ కి తోడూ.. ఫారెన్ లోకేషన్స్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫ్యాన్స్ చేస్తోన్న సందడి ఆకాశమే హద్దన్నట్టు ఉంది. అయితే ఈ మూవీ ప్రమోషన్స్ లో జోరుగా హుషారుగా యంగ్ టైగర్ కనిపిస్తున్నారు. కామ్ అండ్ పీస్ ఫుల్ గా మెగాపవర్ స్టార్ బిహేవ్ చేస్తున్నారు. ఈమధ్య బయటికొచ్చిన ఏ ప్రమోషనల్ ఇంటర్వ్యూ చూసినా తారక్, చరణ్ ల వేరియేషన్ ఇట్టే పసిగట్టేయొచ్చు. వాళ్లు మాటల్లో చెప్పినట్టే రెండు భిన్న ధృవాలు ఒక దగ్గర చేరినట్టుంది ఈ హీరోలిద్దరిని చూస్తుంటే.

RRR: ఆర్ఆర్ఆర్ మరో రికార్డు.. ఏకంగా మిలియన్ మంది!

ట్రిపుల్ ఆర్ తర్వాతే మిగిలిన సినిమాలు అన్నట్టు తారక్ గడిపేస్తున్నారు. కొత్త సినిమాల విషయంలో పెద్ద యాక్టివ్ గా లేరు అయినా సరే జక్కన్న మూవీ ప్రమోషన్స్ లో మాత్రం ఎనర్జిటిక్ గా మాట్లాడుతున్నారు. కానీ ట్రిపుల్ ఆర్ తో పాటే ఆచార్యను పూర్తి చేసిన రామ్ చరణ్.. ఆ వెంటనే శంకర్ మూవీని పట్టాలెక్కించారు. త్వరలోనే గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్ట్ కోసం వర్క్ చేయబోతున్నారు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ లో చూస్తే గుంభనంగా కూర్చుంటున్నారు. సో చేసే పనితో పనిలేదు.. ఎక్కడున్నా.. ఎప్పుడైనా ఫైర్ క్రాకరే అన్నట్టు ఎన్టీఆర్… ఎంత బిజీగా ఉన్నా పైకి కనిపించకుండా ఎప్పటికీ మిస్టర్ కూల్ అనిపించుకుంటూ రామ్ చరణ్.. రియల్లీ ఫ్యాన్స్ మాత్రం భలే అట్రాక్ట్ చేస్తున్నారు.