RRR: సెంచరీ కొట్టిన ఆర్ఆర్ఆర్.. ఆలస్యమైనా తగ్గని క్రేజ్!

ఆర్ఆర్ఆర్.. ప్రస్తుతం యావత్ సినీ ప్రపంచం ఈ సినిమా కోసమే ఎంతో ఆతృతగా ఎదురుచూస్తోంది. దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న.....

RRR: సెంచరీ కొట్టిన ఆర్ఆర్ఆర్.. ఆలస్యమైనా తగ్గని క్రేజ్!

Naatu Naatu Song From Rrr Hits 100 Million Views

RRR: ఆర్ఆర్ఆర్.. ప్రస్తుతం యావత్ సినీ ప్రపంచం ఈ సినిమా కోసమే ఎంతో ఆతృతగా ఎదురుచూస్తోంది. దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీలో ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తుండటంతో ఆర్ఆర్ఆర్ కోసం కేవలం తెలుగు ఆడియెన్స్ మాత్రమే కాకుండా ఇతర భాషా అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ల పవర్‌ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లనున్నట్లు చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌లో తెలుపుతూ వస్తోంది.

Naatu Naatu Song : నాటు కొట్టుడు రికార్డులు!

కాగా ఈ సినిమా రిలీజ్‌కు మరో వారం రోజులే సమయం ఉండటంతో ఈ సినిమాను జనంలోకి తీసుకెళ్లేందుకు జక్కన్న అండ్ టీమ్ తెగ ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే దేశంలోని పలు నగరాలతో పాటు విదేశాల్లో కూడా ఈ సినిమా ప్రమోషన్స్‌తో దుమ్ములేపుతోంది ఆర్ఆర్ఆర్ టీమ్. ఇక ఈ సినిమాలోని పోస్టర్స్, టీజర్, ట్రైలర్లు, సాంగ్స్ యూట్యూబ్‌ను షేక్ చేస్తూ దూసుకుపోతున్నాయి. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ‘నాటు నాటు’ అనే పాట 100 మిలియన్ వ్యూస్‌తో యూట్యూబ్‌లో దుమ్ములేపుతోంది.

యూట్యూబ్‌లో ఈ పాటను రిలీజ్ చేసినప్పటి నుండి మంచి రెస్పాన్స్ దక్కింది. రిలీజ్ సమయంలోనే ఈ పాట రికార్డు స్థాయిలో వ్యూస్ దక్కించుకోవడం ఖాయమని అభిమానులు అన్నారు. ఇక తాజాగా ఈ పాట 100 మిలియన్ మార్క్‌ను టచ్ చేయడంతో చిత్ర యూనిట్‌తో పాటు అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ పాటలో చరణ్, తారక్ అదిరిపోయే స్టెప్పులు అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

Naatu Naatu : రామ్ చరణ్, ఎన్టీఆర్ ‘నాటు నాటు’ స్టెప్పుకి ఇన్ని టేక్స్ తీసుకున్నారా?

చరణ్ అల్లూరి సీతారామరాజుగా, తారక్ కొమురం భీంగా నటిస్తున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తుండగా, డివివి దానయ్య ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాలో ఆలియా భట్, ఒలివియా మారిస్‌లు హీరోయిన్లుగా నటిస్తుండగా, అజయ్ దేవ్గన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. మార్చి 25న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఆర్ఆర్ఆర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.