chandra babu: కొండలను చెరువులుగా మార్చేశారు: చంద్రబాబు
ఏపీ సర్కారు పర్యావరణాన్ని ధ్వంసం చేస్తూ దోచుకుంటోందని ఆరోపించారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ గ్యాంగ్ సభ్యులు ఏపీలోని కొండలను చెరువులుగా మార్చేశారని ఆయన అన్నారు. ఏపీలో 75 అడవులను నాశనం చేశారని ఆయన చెప్పారు. ఇలా చేస్తే భవిష్యత్తు తరాలకు ముప్పు తప్పదని అన్నారు.
- T Venkateshwarlu
- Published On : July 13, 2022 / 08:35 PM IST
Chandrababu
chandra babu: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరుపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ఇవాళ ఆయన గుంటూరు జిల్లా మంగళగిరిలో మీడియాతో మాట్లాడుతూ… ఏపీ సర్కారు పర్యావరణాన్ని ధ్వంసం చేస్తూ దోచుకుంటోందని ఆరోపించారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ గ్యాంగ్ సభ్యులు ఏపీలోని కొండలను చెరువులుగా మార్చేశారని ఆయన అన్నారు. ఏపీలో 75 అడవులను నాశనం చేశారని ఆయన చెప్పారు. ఇలా చేస్తే భవిష్యత్తు తరాలకు ముప్పు తప్పదని అన్నారు.
Afghan girls: తాలిబన్ల పాలనలో అగమ్యగోచరంగా అఫ్గాన్ బాలికల పరిస్థితి
విశాఖ రుషికొండను ధ్వంసం చేశారని ఆయన చెప్పారు. అలాగే, విశాఖ-తూర్పు గోదావరి సరిహద్దుల్లోని బమిడికలొద్దిలో భారతీ సిమెంట్ కోసం తవ్వకాలు జరుపుతున్నారని ఆయన ఆరోపించారు. కర్నూలులో ఎమ్మెల్యే కాటసాని రాం భూపాల్‌రెడ్డి రవ్వలకొండను తవ్వారని ఆయన చెప్పారు. కాకినాడ, చిత్తూరు జిల్లాలోనూ ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయని చెప్పారు. విజయనగరం, అనంతపురం, కడప జిల్లాల్లో ప్రకృతి విధ్వంసానికి పాల్పడుతున్నారని చెప్పారు.
