×
Ad

Viral Video: ఈ కేక్‌ కట్ చేసే ధైర్యముందా?ఎటాక్ చేస్తుందేమో జాగ్రత్త..!

ఈ కేక్‌ కట్ చేసే ధైర్యముందా? చేసి తినగలరా?! అనిపించే కేక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి అదేంటో చూసేయండీ..

  • Published On : October 20, 2021 / 06:19 PM IST

Different Snake Cake Recipie Viral

Python Cake  : ఈ కేక్‌ కట్ చేసే ధైర్యముందా? చేసి తినగలరా?! అనిపించే కేక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గతం కొంతకాలంలో కేకుల్లో ఎన్నో రకాలు. మరెన్నో రుచులతో బేకర్స్ తయారు చేస్తున్నారు. రుచుల్లోనే కాదు కేకుల ఆకారంలో కూడా వారి ప్రతిభను రంగరించి మరీ తయారు చేస్తున్నారు. రకాల ప్లేవర్‌లతో పాటు వింత వింత ఆకారాల్లో కేకులు తయారు చేస్తు వారెవ్వా అనిపించుకుంటున్నారు. కానీ ఇదిగో ఈ కేకును కట్ చేయాలంటే చాలా ధైర్యముండాలబ్బా అనిపిస్తోంది ఈ స్నేక్ కేక్..చుట్టు చుట్టుకుని ఎప్పుడు ఎటాక్ చేద్దామా? అన్నట్లు కాపుకాచుకుని పడుకున్నట్లుగా ఉన్న ఈ స్నేక్ కేక్ హడలెత్తిస్తోంది..!!

Read more : Cake Slice Auction : వేలానికి 40 ఏళ్ల నాటి కేకు ముక్క ..ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

నటాలీ సైడ్‌సెర్ఫ్ అనే ప్రముఖ​ చెఫ్‌ ఈ స్నేక్ కేక్ ను తయారు చేశారు. వెరైటీ ఫేవర్లతో వెరైటీ ఆకారాలతో కేకులు తయారు చేయటం ఈయనగారి స్పెషాలిటీ. ఆమెగారు చేసే కేక్‌లన్ని చాలా చాలా వైరైటిగానూ రియలస్టిక్‌గా ఉంటాయనే పేరు తెచ్చుకున్నారామె. ఈ స్నేక్ కేక్ చూస్తే అది నిజమైన పామే అనిపించేంత నాచ్యురల్ గా తయారు చేశారు ఈ పాము కేకుని.

పైగా ఆ పాము కేకుని చూస్తే ఎ‍ప్పుడూ అటాక్‌ చేద్దామ్మా అన్నంత కోపంగా చూస్తున్న నిజమైన ‘పాము’ లా ఉందే తప్ప కేక్‌లా అస్సులు లేనేలేదు. అంతేకాదు నటాలి వచ్చి ఆ స్నేక్‌ కేక్‌ని కట్‌ చేసేంత వరకు కూడా అది వెన్నులో వణుకు పుట్టించేంత భయంకరమైన పసుపు రంగులో ఉన్న పాములానే ఉంది. ఈ స్నేక్ కేక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వకీ మీరు కూడా ఓ లుక్‌ వేయండి. అది కేకు అని తెలియకపోతే మీరు ఆ దరిదాపులకు కూడా వెళ్లరని పందెం…

Read more : Wedding Cake Payment : పెళ్లిలో తిన్న కేకుముక్కకు డబ్బులు కట్టమని అతిథిని డిమాండ్ చేసిన కొత్తజంట..