Wedding Cake Payment : పెళ్లిలో తిన్న కేకుముక్కకు డబ్బులు కట్టమని అతిథిని డిమాండ్ చేసిన కొత్తజంట..

మా పెళ్లిలో తిన్న కేకు ముక్కకు డబ్బులు పంపించమని పెళ్లికి వచ్చిన స్నేహితుడుకి మెజేస్ పంపించింది వధువు.

Wedding Cake Payment : పెళ్లిలో తిన్న కేకుముక్కకు డబ్బులు కట్టమని అతిథిని డిమాండ్ చేసిన కొత్తజంట..

Wedding Cake Payment

Wedding Cake Payment : పెళ్లికి పిలిచిన అతిథుల్ని సాదరంగా ఆహ్వానించి విందు భోజనాలు దగ్గరుండి మరీ వడ్డిస్తాం. కానీ ఓ కొత్త జంట మాత్రం ఫుల్ డిఫరెంట్. మా పెళ్లికి వచ్చి కేకు ముక్కలు తిన్నావు తిన్నదానికి డబ్బులు కట్టమని ఓ గెస్ట్ కు మెసేజ్ పంపించారు. అంతేకాకుండా సదరు అతిథి తిన్న కేకు ముక్కలు తినే వీడియోను కూడా పంపించారు. దీంతో సదరు వ్యక్తి షాక్ అయ్యాడు. ఈ విషయం తెలిసిన నెటిజన్లు సదరు కొత్త జంటపై సెటైర్లు వేస్తున్నారు.ఇంత కక్కుర్తి అయితే పెళ్లికి అతిథుల్ని పిలవటం ఎందుకు ఇద్దరు పెళ్లి చేసేసుకుంటే సరిపోయేదిగా..పిలవటమెందుకు? ఇలా అవమానించటం ఎందుకు అంటున్నారు.

ఈ వింత వెడ్డింగ్ జంట విషయానికొస్తే.. బ్రిటన్‌కు చెందిన ఒక వ్యక్తి తన స్నేహితురాలి పెండ్లికి వెళ్లాడు. అక్కడ వెడ్డింగ్‌ కేక్‌ ముక్క అందరికి పంచగా అతను కూడా తిన్నాడు. ఆ తరువాత పెళ్లి హడావిడి అయిపోయింది. సదరు కొత్త జంట హనీమూన్ కు వెళ్లిపోయారు.

Read more : Rate Card Wedding Party : పెళ్లికి మీరిచ్చే గిఫ్ట్ బట్టే విందు భోజనం

ఆ తరువాత అతడికి వధువు నుంచి చిన్న వీడియో వచ్చింది. అదేమిటో చూద్దామనుకున్నాడు. ఓపెన్ అయ్యేలోగా బహుశా తాను కొత్త జంటతో తీయించుకున్న ఫోటోలు అయి ఉంటాయనుకున్నాడు. కానీ వీడియో చూశాక షాక్ అయ్యాడు. ఆ వీడియోలో అతను కేకు ముక్క తింటున్నట్లుగా ఉంది.

దీంతో వధువు పంపించిన మెసేజ్ చదివాడు. దాంట్లో ‘మేము మా పెండ్లి వీడియో సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించాం. అందులో నువ్వు మా వెడ్డింగ్‌ కేక్‌ రెండు ముక్కలు తిన్నావు. కానీ నువ్వు ఒక దానికే డబ్బులు చెల్లించావు. రెండో దానికి చెల్లించలేదు. కాబట్టి రెండో కేకు ముక్కకు 3.66 పౌండ్లు (రూ.366) పంపిస్తావా’ అని ఆమె అడిగింది.

కాగా..వెడ్డింగ్‌ కేక్‌ ప్రతి పీస్‌కు గెస్ట్‌లు డబ్బులు చెల్లించాలని సదరు వధువరులు మొదటే చెప్పారట. అలా రెండో కేకు ముక్క కోసం డబ్బులు చెల్లించాల్సిన విషయాన్ని ఆమె వీడియో ద్వారా నిరూపిస్తు మరీ అడగటం విశేషం.

Read more : Nicole Oliveira: NASAతో 8 ఏళ్ల చిన్నారి..బొమ్మలతో ఆడుకునే వయస్సులో ‘ఆస్టరాయిడ్‌’ తో ఆటలు

ఈ విషయాన్ని సదరు అతిథి వధువు పంపిన ఈ మెసేజ్‌ను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో అదికాస్తా వైరల్ అయ్యింది.దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు. వెడ్డింగ్‌ కేక్‌ కోసం గెస్ట్‌ల నుంచి చార్జ్‌ చేయడం ఏంటీ మరీ అసహ్యంగా అంటున్నారు. పెళ్లి అయ్యాక కొత్త జంట ఎంచక్కా హనీమూన్‌ను ఎంజాయ్‌ చేయకుండా సీసీటీవీ ఫుటేజ్‌ పరిశీలించి గెస్ట్‌లు ఎన్ని కేక్‌ ముక్కలు అదనంగా తిన్నారో చూసి వారికి మెసేజ్‌లు పంపడం చాలా అవమానకంగా..అసహ్యంగా ఉందని చిరాకుపడుతున్నారు.

newlywed couple asks guest to pay rs.366 for eatingan extra piece of wedding cake