Rate Card Wedding Party : పెళ్లికి మీరిచ్చే గిఫ్ట్ బట్టే విందు భోజనం

పెళ్లికెళ్లామా? భోజనం చేసి వచ్చామా? అనుకునేవారికి ఓ జంట ఝలక్ ఇచ్చింది. వెడ్డింగ్ కార్డులో భోజన ప్రియులకు ఓ జంట ఝలక్ ఇచ్చింది. పెళ్లికి వచ్చామా? ఫోటో తీయించుకున్నామా? భోజనం చేసి పోయామా? అనుకునేవారికి ఒక జంట అతిథుల నుంచి విందు కోసం అయ్యే ఖర్చును వసూలు చేసేందుకు ‘రేట్ కార్డు’ పంపించింది.

Rate Card Wedding Party : పెళ్లికి మీరిచ్చే గిఫ్ట్ బట్టే విందు భోజనం

Rate Card For Wedding Party

Rate card for wedding party : ఈరోజుల్లో పెళ్లికి వెళ్లటం ఎలా ఉందంటే..ఏదో వెళ్లామా..బంధువులకు కనిపించామా?భోజనం చేశామా?వచ్చామా..అన్నట్లుగా ఉంది. గిఫ్టులు కూడా ఇస్తే ఇచ్చారు లేకుంటే అదీ లేదు. పెళ్లికి వెళ్లటం వధూ వరుల నెత్తిమీద నాలుగు అక్షింతలు చల్లి భోజనాలకు వెళ్లటం సుష్టుగా తినటం వచ్చేయటం..అంతటితో ఊరుకుంటున్నారా ఏంటీ..వాళ్ల పెళ్లిలో ఫలానా ఐటెమ్ బాగాలేదు. ఊప్పూ లేదు కారం లేదు..బిర్యానీ కూడా బాగాలేదు. అంటూ వంకలు పెడుతుంటారు. వధూవరులను మనస్ఫూర్తిగా ఆశీర్వదించి ఓ బహుమతి ఇవ్వటం తగ్గిపోయింది. అదే రిసెప్షన్ అయితే వెళ్లటం ఓహేక్ హ్యాండ్ ఇవ్వటం..(ఈ కరోనా కాలంలో అది కూడా లేదనుకోండీ) ఓ ఫోటో తీయించుకుని భోజనం చేసి వచ్చేయటం..అంతే..

ఈ క్రమంలో ఇటువంటి భోజన ప్రియులకు ఓ జంట ఝలక్ ఇచ్చింది. పెళ్లికి వచ్చామా? ఫోటో తీయించుకున్నామా? భోజనం చేసి పోయామా? అనుకునేవారికి ఒక జంట అతిథుల నుంచి విందు కోసం అయ్యే ఖర్చును వసూలు చేసేందుకు ‘రేట్ కార్డు’ పంపించింది. ఇదేంటీ ఇటువంటిది ఎప్పుడూ చూడలేదే..అసలు వినను కూడా వినలేదే అనుకునేలా ఉందీ ‘రేట్ కార్డు’.ఎటువంటి గిఫ్ట్ ఇస్తారో దానికి తగినట్లుగానే విందు భోజనం ఉంటుందని ఆ కార్డులో తెలిపింది. సోషల్ మీడియా సైట్ ‘రేడియో’లో షేర్ చేయటంతో అది వైరల్‌గా మారింది.

ఈ రేట్ కార్డులో ఆహారం ఐటెమ్ దాని ఖరీదు వంటివి పొందుపరిచారు. లవ్వింగ్ గిఫ్ట్, సిల్వర్ గిఫ్ట్, గోల్డెన్ గిఫ్ట్, ప్లాటినం గిఫ్ట్ అనే నాలుగు రకాల కేటగిరీలు కూడా ఉన్నాయి. ఈ కార్డులో ఉన్న వివరాల ప్రకారం రూ. 18,500(250 డాలర్లు) ఖరీదు చేసే గిఫ్ట్ ఇచ్చిన వారికి లవ్వింగ్ క్యాటగిరీ విందు పెడతారట. అలాగే ఆయా గిప్టుల ధరలను బట్టి ఆ గిఫ్టులు ఇచ్చినవారికి ఆయా రేట్లను బట్టి రేంజ్ ను బట్టి విందు భోజనం వడ్డించనున్నారు.

కాగా ఈ వెడ్డింగ్ పార్టీ రేట్ కార్డు చూసిన కొందరు నెటిజన్లు హవ్వా ఇదేం కాలం కరోనా కాలంలో వింత వింత రకాలుగా పెళ్లిళ్లు చేసుకోవటం గురించి విన్నాం గానీ ఇదేంటమ్మా అంటున్నారు. ఒక యూజర్… భారీ గిప్టులు అందుకోవటానికి ఇదోరకమైన టెక్నిక్ అనీ..మరొకరు ఇలా గిఫ్టు తీసుకుని అలా భోజనం పెడతారా?అంటే గిప్టులు తీసుకురానివారికి భోజనం పెట్టారా ఏంటీ అంటే..ఇంకొకరు ఈ పెళ్లికి వెళ్లే బదులు మెక్ డొనాల్డ్స్‌కు వెళితే సరిపోతుందని వ్యాఖ్యానించారు. ఎవరు ఎలా అనుకున్నాగానీ సదరు జంట ఇటువంటి ఐడియా మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.