Delhi Metro : ఢిల్లీ మెట్రోలో బెస్ట్ పెర్‌ఫార్మెన్స్.. చిన్నారి డ్యాన్స్‌కి నెటిజన్లు ఫిదా
ఢిల్లీ మెట్రో ఎప్పుడూ వార్తల్లోనే ఉంటుంది. రోజూ ఏదో ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. ఇప్పటి వరకూ వచ్చిన వీడియోలకు భిన్నంగా ఓ చిన్నారి చేసిన డ్యాన్స్ కంపార్ట్‌మెంట్‌లోని ప్రయాణికుల్ని సోషల్ మీడియాలో నెటిజన్లను ఆకట్టుకుంది.
- Lakshmi 10tv
- Published On : May 31, 2023 / 05:48 PM IST
Delhi Metro
Viral Video : ఇటీవల కాలంలో మెట్రోల్లో అభ్యంతరకర వీడియోలు చేస్తూ చాలామంది ప్రయాణికుల్ని ఇబ్బందికి గురిచేస్తున్నారు. ఆ తరువాత కేసుల్లో ఇరుక్కుని చిక్కులు తెచ్చుకుంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఢిల్లీ మెట్రోలో ఓ చిన్నారి చేసిన డ్యాన్స్ అందర్నీ అలరించింది. నెటిజన్ల మనసుకి నచ్చింది.
Delhi Metro : ఢిల్లీ మెట్రోలో ఇద్దరు మహిళల మధ్య రచ్చ.. పెప్పర్ స్ప్రే ప్రయోగించిన మహిళ వీడియో వైరల్
ఢిల్లీ మెట్రో ఎప్పుడూ వార్తల్లో ఉంటుంది. ఏదో ఒక న్యూస్ నిత్యం వైరల్ అవుతూ ఉంటుంది. ఇప్పటి వరకూ ప్రేమ జంటలు ముద్దు పెట్టుకునే వీడియోలు, యువతుల డ్యాన్స్‌లు, రీల్స్‌తో హోరెత్తించారు. వీటిలో చాలామటుకు నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యాయి. ఈ దారుణాలు మేము చూడలేకపోతున్నామని గగ్గోలు పెట్టారు. ఇలాంటి తరుణంలో ఓ చిన్నారి బ్లూ కలర్ అవుట్ ఫిట్‌లో ‘మిన్నా మిన్నా’ డ్యాన్స్ చేసి అందర్నీ అలరించింది. ఈ వీడియోకి లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి. చక్కని డ్యాన్స్ మూమెంట్స్‌తో చిన్నారి అందరి మనసుని దోచుకుంది. కంపార్ట్‌మెంట్‌లో ప్రయాణికులు సైతం ఆమె డ్యాన్స్‌ను ఎంజాయ్ చేశారు.
Delhi Metro : ఢిల్లీ మెట్రోలో మారిన ట్రెండ్.. అద్భుతమైన పాటలతో అలరించిన యువకుడు
ఇక ఈ వీడియోని somi_sharma01 అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ షేర్ చేశారు. వీడియో చూసిన వారంతా లవ్ ఎమోజీలతో కామెంట్లు పెడుతున్నారు. ‘మిన్నా మిన్నా’ పాటను గ్యారీ సంధు మరియు జోష్ సిద్ధూ పాడారు.
