Delhi Metro : ఢిల్లీ మెట్రోలో మారిన ట్రెండ్.. అద్భుతమైన పాటలతో అలరించిన యువకుడు

ఢిల్లీ మెట్రోలో ట్రెండ్ మారింది. లవర్స్ ముద్దులు పెట్టుకోవడాలు, పెప్పర్స్ స్ప్రే చల్లుకోవడాలు, వింత డ్యాన్స్‌లకు ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. తాజాగా ఓ యువకుడు అద్భుతమైన వాయిస్‌తో బాలీవుడ్ పాటలు పాడి అందరి మనసు దోచుకున్నాడు.

Delhi Metro : ఢిల్లీ మెట్రోలో మారిన ట్రెండ్.. అద్భుతమైన పాటలతో అలరించిన యువకుడు

Delhi Metro

Delhi Metro :  ఢిల్లీ మెట్రో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంది. డ్యాన్స్‌లు చేస్తూ ప్రయాణికులకు ఇబ్బంది కలిగించడం.. జంటలు ముద్దు పెట్టుకోవడాలు.. తోటి మహిళపై పెప్పర్ స్ప్రే చల్లిన మహిళ .. ఇలా రకరకాల వార్తలు హల్ చల్ చేశాయి. తాజాగా ఓ యువకుడు అద్భుతమైన గళంతో బాలీవుడ్ పాటలు పాడి అందరి మనసులు దోచుకున్నాడు.

Delhi Metro : ఢిల్లీ మెట్రోలో ఇద్దరు మహిళల మధ్య రచ్చ.. పెప్పర్ స్ప్రే ప్రయోగించిన మహిళ వీడియో వైరల్

రద్దీగా ఉండే మెట్రోల్లో సడెన్‌గా ఎవరో ఒకరు ఎంట్రీ ఇవ్వడం.. ఏదో ఒక ఫీట్ చేస్తూ జనాలకు షాక్ ఇవ్వడం కామన్ అయిపోయింది. ఢిల్లీ మెట్రో మరీ ప్రత్యేకం. ఖచ్చితంగా రోజు ఏదో ఒక వార్తతో వైరల్ అవుతూ ఉంటుంది. కొంతకాలంగా కాస్త ఇబ్బంది కలిగించే అంశాలను చూసిన ప్రయాణికులకు కాస్త ఊరట ఇస్తూ ఓ యువకుడు ఢిల్లీ మెట్రోలో బాలీవుడ్ సాంగ్స్ పాడి అందరినీ అలరించాడు. యూట్యూబ్‌లో షేర్ చేయబడిన ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

Delhi Metro : ఢిల్లీ మెట్రోలో ఆగని డ్యాన్స్‌ల హంగామా.. భోజ్‌పురీ సాంగ్‌కి అమ్మాయి డ్యాన్స్ వీడియో వైరల్

ట్రైన్ కదులుతూ ఉండగా ఒక యువకుడు బాలీవుడ్ పాటలు పాడుతూ కనిపిస్తాడు.. కూర్చున్న వ్యక్తి గిటార్ వాయిస్తుండగా మెట్రో కోచ్‌ మధ్యలో నిలబడి పాటలు పాడాడు. మెట్రోలో డ్యాన్స్ చేయడం, కెమెరాతో షూట్ చేయడం నిషేధం అయినప్పటికీ ఎవరూ నియమాలు పాటించట్లేదు. ఇక ఈ వీడియోని చూసిన వారంతా “గిటార్ మ్యాన్ కి సెల్యూట్” అని .. “అద్భుతం బ్రో” అని కామెంట్లు పెట్టారు. మొత్తానికి చాలారోజుల తర్వాత ఢిల్లీ మెట్రోలో ప్రయాణికులకు చక్కని పాటలతో కాస్త ఉపశమనం లభించిందన్నమాట.