Minister KTR : అందరికీ చిన్ననాటి జ్ఞాపకాలు ఎప్పుడూ మధురంగా ఉంటాయి. చిన్నప్పటి డ్రెస్సింగ్ స్టైల్, హెయిల్ స్టైల్ తిరిగి ఇప్పుడు ఫోటోల్లో చూసుకుంటే మనమేనా? అనిపిస్తాయి. మంత్రి కేటీఆర్ (KTR) గారు తన చిన్ననాటి ఫోటో ఒకటి ట్విటర్లో షేర్ చేశారు. అప్పటి తన హెయిర్ అండ్ స్టైల్ అంటూ పోస్ట్ చేసిన ఫోటోకి ట్విటర్లో అనూహ్య స్పందన వస్తోంది.
Viral Video : షాకింగ్.. పోలీస్‌ని 20 కిమీ లాక్కెళ్లిన కారు డ్రైవర్, వీడియో వైరల్
మంత్రి కేటీఆర్‌ది ప్రత్యేకమైన శైలి అని చెప్పాలి. ఏ కార్యక్రమాల్లో అయినా జనాలతో ఆయన ఇంటరాక్ట్ అయ్యే తీరు ఆకట్టుకుంటుంది. ఆయన మాట్లాడుతుంటే జనం ఆసక్తిగా వింటారు. ప్రతిపక్ష నేతలకు దిమ్మతిరిగే కౌంటర్లు ఇస్తూ అద్దిరిపోయే స్పీచ్ లు ఇస్తారు. అంతలోనే నవ్వుల పువ్వులు పూయిస్తారు. ఆయన నడక, నడత అన్నీ ప్రత్యేకమే. ఇక సోషల్ మీడియా(Social Media)లో అయితే మరీ యాక్టివ్ గా ఉంటారు. ముఖ్యంగా ప్రజా సమస్యలపై వెంటనే స్పందిస్తారు. వారికి సానుకూలమైన సమాధానం ఇస్తూ ఆ సమస్యలు పరిష్కారం దిశగా అధికారులకు సూచనలు చేస్తారు.
ఎప్పుడూ ప్రభుత్వ కార్యక్రమాలతో బిజీగా ఉండే మంత్రి కేటీఆర్ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తన పర్సనల్ విషయాలు కూడా షేర్ చేస్తుంటారు. తాజాగా ఆయన తన చిన్నప్పటి ఫోటోను ట్విట్టర్ లో షేర్ చేశారు. చిన్నప్పటి హెయిర్.. హెయిర్ స్టైల్ అంటూ ఆయన షేర్ చేసిన ఫోటో ఇప్పుడు ట్విటర్ లో వైరల్ అవుతోంది.
Children’s Amazing Dance : ‘పర్దేశియా’ సాంగ్‌కి దుమ్మురేపుతున్న చిన్నారులు వీడియో వైరల్
కేటీఆర్(KTR) ఫోటో చూసిన ట్విట్టర్ యూజర్లు పాత సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ లా ఉన్నారని.. నైస్ అన్నా.. లవ్ యూ అన్నా.. అని కామెంట్లు పెడుతున్నారు. ఎప్పుడు బిజీగా ఉండే మంత్రులు అప్పుడప్పుడు జనంతో ఇలా సరదాగా ఇంటరాక్ట్ అయితే వాళ్లు జనానికి మరింత చేరువ అవుతారనే విషయం మంత్రి కేటీఆర్ గారి పోస్టులని బట్టి అర్ధం చేసుకోవచ్చు.
Had some Hair N Style those days 😎#Throwback #ChildhoodPic pic.twitter.com/8P4MI02AeI
— KTR (@KTRBRS) April 16, 2023