Citroen C3: సిట్రన్ నుంచి సీ3 పేరుతో కొత్త కారు విడుదల

సిట్రన్ ఇండియా నుంచి సీ3 పేరుతో కొత్త కారు బుధవారం మార్కెట్లోకి విడుదలైంది. దేశంలోని 19 షో రూమ్‌లలో బుధవారం నుంచి ఈ కార్లు అందుబాటులో ఉంటాయని కంపెనీ తెలిపింది. ఆన్‌లైన్‌లోనూ కార్ బుక్ చేసుకునే వీలుంది.

Citroen C3

Citroen C3: ప్రముఖ కార్ల తయారీ సంస్థ సిట్రన్ ఇండియా నుంచి సీ3 పేరుతో కొత్త కారు బుధవారం మార్కెట్లోకి విడుదలైంది. దీని ప్రారంభ ధర రూ.5.7 లక్షలు (ఎక్స్-షో రూమ్). సిట్రన్ స్టెల్లాంటిస్ గ్రూప్‌నకు చెందిన సంస్థ. ఈ కారు 1.2 లీటర్ల పెట్రోల్ ఇంజిన్ కెపాసిటీతో తయారైంది. దీనిలో రెండు మోడల్స్ ఉన్నాయి.

Piyush Goyal: ధాన్యం సేకరణపై తెలంగాణ ప్రభుత్వం రాజకీయం చేస్తోంది: కేంద్ర మంత్రి పియూష్ గోయల్

ఒకటి 1.2 లీటర్ ప్యూర్‌టెక్, 82 మేటెడ్ విత్ 5 స్పీడ్ మ్యానువల్ ట్రాన్స్‌మిషన్ కాగా, రెండోది 1.2 లీటర్ ప్యూర్‌టెక్, 110 మేటెడ్ విత్ 6 స్పీడ్ మ్యనువల్ ట్రాన్స్‌మిషన్ పవర్ కలిగినది. సిట్రన్ కంపెనీ నుంచి బి-హ్యాచ్ సెగ్మెంట్‌లో దేశంలో విడుదలైన తొలి కారు ఇదే. ఈ కారులో 90 శాతం విడిభాగాల్ని దేశీయంగానే తయారు చేశారు. దేశంలోని 19 షో రూమ్‌లలో బుధవారం నుంచి ఈ కార్లు అందుబాటులో ఉంటాయని కంపెనీ తెలిపింది. ఆన్‌లైన్‌లోనూ కార్ బుక్ చేసుకునే వీలుంది. దేశంలోని 90 నగరాలకు డైరెక్ట్ ఫ్యాక్టరీ నుంచి ఆన్‌లైన్‌ ద్వారా కార్లను డెలివరీ చేస్తామని కంపెనీ చెప్పింది. కారులోపల 26 సెంటీమీటర్ల ఇన్ఫోటైన్‌మెంట్ టచ్ స్క్రీన్, దీనిలో 56 కస్టమైజేషన్లు కూడా ఉన్నట్లు కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు.

Senior Citizens: సీనియర్ సిటిజన్లకు రైల్వే షాక్.. టిక్కెట్‌పై సబ్సిడీ పునరుద్ధరణకు నో

సిట్రన్ కంపెనీ నుంచి ఇప్పటికే సీ5 ఎస్‌యూవీ వాహనాలు విడుదలై మార్కెట్లో ఉన్నాయి. ఈ కంపెనీకి రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్ చెన్నైలో ఉండగా, అసెంబ్లీ ప్లాంట్ తిరువళ్లూరులో, పవర్ ట్రైన్ ప్లాంట్ హోసూరులో ఉన్నాయి. పారిస్‌లో ఉన్న తమ సంస్థతో కలిపి, ఇండియాలోనే కార్లు తయారు చేస్తోంది.