గుడ్ న్యూస్ : తెలంగాణలో కరోనా ఫ్రీ జిల్లాలు ఇవే

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ప్రభుత్వం తీసుకుంటున్న పకడ్బంది చర్యలు సత్పలితాలు ఇస్తున్నాయి. వైరస్ ప్రబలతున్న రోజుల్లో 20 నుంచి 60 దాక కేసులు నమోదైన సంగతి తెలిసిందే. కానీ..ప్రస్తుతం సింగిల్ డిజిట్ కు పరిమితమవుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో 11 కరోనా రహిత జిల్లాలను ప్రభుత్వం ప్రకటించింది.
వనపర్తి, వరంగల్ రూరల్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. సిద్ధిపేట, మహబూబ్ నగర్, మంచిర్యాల, నారాయణ పేట, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, నాగర్ కర్నూలు, ములుగు జిల్లాల్లో కేసులు నమోదు కావడం లేదు. ఈ జిల్లాల్లో కరోనా సోకిన వారందరూ చికిత్స పొంది..పూర్తి ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు.
2020, ఏప్రిల్ 29వ తేదీ బుధవారం కొత్తగా 7 పాజిటివ్ కేసులు నమోదయినట్లు, ఇవి కూడా GHMC పరిధిలో ఉన్నాయని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. హైదరాబాద్ లో తొలుత నమోదైన కేసులు ఇప్పుడు నమోదు కావడం లేదని, క్రమక్రమంగా ఇక్కడ కూడా తగ్గుముఖం పడుతున్నాయని వైద్యలు వెల్లడిస్తున్నారు.
కంటైన్ మెంట్ కేంద్రాల్లో పకడ్బంది చర్యలు తీసుకుంటున్నారు. ఇక్కడ ప్రజలకు కావాల్సిన నిత్యావసర సరుకులు, ఇతరత్రా అవసరాలను అధికారులు తీరుస్తున్నారు. అయితే.. హైదరాబాద్ కేసులు ఎక్కువవుతుండడం..తక్కువవుతుండడంతో నగర ప్రజలు టెన్షన్ పడుతున్నారు. కేసులు తగ్గిపోవాలని కోరుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ 2020, మే 03వ తేదీ వరకు కొనసాగనుండగా..దీనిని తెలంగాణ ప్రభుత్వం మే 07వ తేదీ వరకు పొడిగించిన సంగతి తెలిసిందే.