Viral Video: తన ఇల్లు.. తన కుటుంబం.. బాగుంటే చాలు.. పరిసరాలు ఏమైనా పర్వాలేదు. ఇది కొందరు మనుషుల భావన. కానీ పరిసరాలు బాగుంటేనే తానూ, తన కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందని ఎన్ని చెప్పినా వారి ముందు దండగే అవుతుంది. ప్రభుత్వాలు స్వచ్ఛ భారత్ అంటూ ఎన్ని కార్యక్రమాలు పెట్టినా సామజిక స్పృహలేని వారికి చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్లే అవుతుంది. పక్కనే చెత్త కుండీ ఉన్నా కదల్లేక.. చేతిలోని వేస్ట్ కాస్త పక్కకి జరిగి డస్ట్ బిన్ లో వేసే ఓపిక లేక ఎక్కడ పడితే అక్కడ పడేయడం మనం నిత్యం చూస్తూనే ఉంటాం. అలాంటి వారు సిగ్గుపడేలా ఓ కాకి డస్ట్ బిన్ చుట్టూ కింద వేసిన చెత్తను జాగ్రత్తగా నోటితో తీసి డస్ట్ బిన్ లో వేస్తుంది.
This crow knows that humans have lost the sense of shame pic.twitter.com/9ULY7qH4T2
— Susanta Nanda IFS (@susantananda3) April 1, 2021
కాకి జాగ్రత్తగా చెత్తను ఏరి డస్ట్ బిన్ లో వేసిన వీడియో ఒకటి ఇప్పుడు సామజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో అడుగు దూరంలో పక్కనే డస్ట్ బిన్ ఉన్నప్పటికీ కొందరు కేర్ లెస్ పీపుల్ చెత్తను బయట పడేశారు. ఆ చెత్తను గమనించిన కాకి ఒకటి డస్ట్ బిన్ వద్దకు వచ్చి.. ఒక్కొక్కటి చెత్తను ముక్కుతో కరచుకొని ఓపికతో ఆ చెత్తను డస్ట్ బిన్లో వేసింది. ఈ దృశ్యాలను ఫారెస్టు సర్వీసెస్ అధికారి సుశాంత నంద తన ట్విట్టర్ పేజీలో పోస్టు చేయగా ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. సామజిక స్పృహలేని మనుషులు ఈ వీడియో చూసైనా నేర్చుకోవాలని.. మనుషులను సిగ్గుపడేలా చేసిన కాకిని కొనియాడుతూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
Read:Latest Food Trend Fried Water: సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫుడ్ ట్రెండ్ ‘ఫ్రైడ్ వాటర్’..!