Latest Food Trend Fried Water: సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫుడ్ ట్రెండ్ ‘ఫ్రైడ్ వాటర్’..!

కరోనా మహమ్మారితో ప్రపంచ వ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ తో ఎన్నోన్నో కొత్త కొత్త ఆవిష్కరణలు ప్రపంచం దృష్టికొచ్చాయి. కాస్త వంటా వార్పు మీద అవగాహనా ఉన్న వాళ్ళైతే రకరకాల కొత్త కొత్త వంటాకాలను వెలుగులోకి తెచ్చారు. అందులో వాటర్ డీప్ ఫ్రై కూడా ఒకటి. నీళ్లను కూడా డీప్ ఫ్రై చేయొచ్చని.. దానిని తినవచ్చని ఒక వంటకాన్ని తయారుచేయడంతో పాటు తిని చూపించడంతో ఇప్పుడు ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో ఇదే ట్రెండీ వంటకంగా మారిపోయింది.

Latest Food Trend Fried Water: సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫుడ్ ట్రెండ్ ‘ఫ్రైడ్ వాటర్’..!

Fried Water Is The Latest Food Trend On Social Media

Latest Food Trend Fried Water: కరోనా మహమ్మారితో ప్రపంచ వ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ తో ఎన్నోన్నో కొత్త కొత్త ఆవిష్కరణలు ప్రపంచం దృష్టికొచ్చాయి. అప్పటి వరకు ఉరుకుల పరుగుల జీవితాలన్నీ గదులకు పరిమితమవడంతో ఏం చేయాలో పాలుపోని వారంతా రకరకాలుగా విభిన్న ప్రయోగాలు చేశారు. ఇక కాస్త వంటా వార్పు మీద అవగాహనా ఉన్న వాళ్ళైతే రకరకాల కొత్త కొత్త వంటాకాలను వెలుగులోకి తెచ్చారు. అందులో వాటర్ డీప్ ఫ్రై కూడా ఒకటి. వాటర్ డీప్ ఫ్రై ఏంటి.. అదేమన్నా ఘనపదార్ధమా ఫ్రై చేసుకొని తినడానికి అనుకుంటున్నారా? కానీ నీళ్లకు కూడా డీప్ ఫ్రై చేయొచ్చని.. దానిని తినవచ్చని ఒక వంటకాన్ని తయారుచేయడంతో పాటు తిని చూపించడంతో ఇప్పుడు ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో ఇదే ట్రెండీ వంటకంగా మారిపోయింది.

సహజంగా నీళ్లని డీప్ ఫ్రై చేస్తే ఏమొస్తుంది.. మహా అయితే నీళ్లు కాస్త ఆవిరైపోతాయి అనుకొనే వాళ్ళకి జేమ్స్ ఆర్గిల్ అనే కెమిక‌ల్ ఇంజినీర్ నీళ్లని ఫ్రై చేసుకొని తిని చూపించి అవాక్కయేలా చేశాడు. 2020, డిసెంబ‌ర్‌లో చేసిన డీప్ ఫ్రైడ్ వాట‌ర్‌ వంటకం వీడియోను ది యాక్ష‌న్ ల్యాబ్ అనే త‌న యూట్యూబ్ చానెల్లో పోస్ట్ చేయ‌డంతో ప్ర‌స్తుతం ఇది వైర‌ల్‌గా మారింది. లేటెస్ట్ ఫుడ్ ట్రెండ్ అయి కూర్చున్న డీప్ ఫ్రైడ్ వాటర్ ఇప్పటికే సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుండగా ఈ కొత్త ర‌కం వంట‌కంపై నెటిజ‌న్‌ల నుంచి కామెంట్ల వ‌ర్షం కురుస్తుంది. డీప్ ఫ్రైడ్ వాటర్ ను ఆన్ లైన్ లో ఎలా ఆర్డర్ చేయాలని ఒక నెటిజన్ అడిగితే.. పానీ పూరీలోని పానీతో కలిపి ఈ వాటర్ డీప్ ఫ్రై తినొచ్చా అని నెటిజన్స్ రకరకాల ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు.

నిజానికి డీప్ ఫ్రైడ్ వాటర్ ఇప్పుడు కొత్తగా ఏం మొదలు కాలేదు మొదటిసారి 2016లో ఫుడ్ బ్లాగర్, చెఫ్, ఫ్రైడ్ ఫుడ్ అభిమాని అయిన జోనాథన్ మార్కస్ మ‌దిలో మెదిలగా ఆయన ట్రై చేసి సక్సెస్ అయ్యాడు. ఆయ‌న వాట‌ర్‌ను డీప్ ఫ్రై చేసి ఆ వీడియోను యూట్యూబ్ పేజీలో అప్‌లోడ్ చేసినా అప్పుడు అది ట్రెండ్ కాలేదు. కానీ ఇప్పుడు జేమ్స్ ఆర్గిల్ వీడియో మాత్రం ట్రెండ్ అయింది. అయితే.. అసలు ఇంతకీ ఇంకిపోకుండా.. ఆవిరి కాకుండా వాటర్ డీప్ ఫ్రై ఎలా చేస్తారనే కదా మీ డౌట్? దానికి ఒక రసాయనిక చర్యను ఉపయోగిస్తున్నారు.

కాల్షియం ఆల్జీనేట్ అనే రసాయన సమ్మేళనాన్ని ఉపయోగించి నీళ్ల‌ను డీప్ ఫ్రై చేస్తున్నారు. సజల కాల్షియం క్లోరైడ్, సజల సోడియం ఆల్జీనేట్‌ల మిశ్ర‌మాన్ని ఈ డీప్ ఫ్రైడ్ వాట‌ర్ త‌యారికీ ఉపయోగించగా ఈ రెండు ర‌కాల ర‌సాయ‌నాలు నీటి చుట్టూ ఒక స్త‌రంలా ఏర్ప‌డి నీటిని బంధించి ఉంచుతాయి. అనంతరం ఆ బాల్స్ ను ఆయిల్ లో వేసి ఫ్రై చేస్తున్నారు. ఇది సరైన పాళ్ళలో చేయకపోయినా.. జాగ్రత్తలు తీసుకోకపోయినా చాలా ప్రమాదకరమని జేమ్స్ హెచ్చరిస్తున్నాడు.

Read:Beauty Pageant for Sheep: అందాల పోటీల్లో గొర్రెల క్యాట్ వాక్.. మీరెప్పుడైనా చూశారా?