MLAs Salary Hike: 66 శాతం పెరగనున్న ఢిల్లీ ఎమ్మెల్యేల జీతాలు

జీతాలతోపాటు ఇతర అలవెన్సులు కూడా పెరుగుతాయి. నిజానికి దేశంలో అతి తక్కువ జీతం తీసుకుంటోంది ఢిల్లీ ఎమ్మెల్యేలే. దాదాపు పదకొండేళ్లుగా అక్కడి అసెంబ్లీలో జీతాలు పెంచలేదు. ఈ కొత్త బిల్లును అసెంబ్లీ ఆమోదించినప్పటికీ, అమల్లోకి రావాలంటే రాష్ట్రపతి ఆమోదం తప్పనిసరి.

MLAs Salary Hike: ఢిల్లీ ఎమ్మెల్యేలకు త్వరలో జీతాలు పెరగబోతున్నాయి. శాసన సభ్యులకు 66 శాతం జీతాలు పెంచుతూ రూపొందించిన బిల్లును ఢిల్లీ అసెంబ్లీ సోమవారం ఆమోదించింది. ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రభుత్వ చీఫ్ విప్‌లు, స్పీకర్, డిప్యూటీ స్పీకర్, ప్రతిపక్ష నేత.. ఇలా అందరి జీతాలు 66 శాతం పెంచేలా రూపొందించిన ఐదు బిల్లులను శాసన సభ ఆమోదించింది.

Service Charge: సర్వీస్ ఛార్జీల కోసం బలవంతం చేయొద్దు.. రెస్టారెంట్లకు కేంద్రం ఆదేశం

జీతాలతోపాటు ఇతర అలవెన్సులు కూడా పెరుగుతాయి. నిజానికి దేశంలో అతి తక్కువ జీతం తీసుకుంటోంది ఢిల్లీ ఎమ్మెల్యేలే. దాదాపు పదకొండేళ్లుగా అక్కడి అసెంబ్లీలో జీతాలు పెంచలేదు. ఈ కొత్త బిల్లును అసెంబ్లీ ఆమోదించినప్పటికీ, అమల్లోకి రావాలంటే రాష్ట్రపతి ఆమోదం తప్పనిసరి. ప్రస్తుతం ఈ బిల్లును రాష్ట్రపతి పరిశీలనకు పంపుతారు. అక్కడ కూడా ఆమోదముద్ర వస్తే కొత్త జీతాలు అమల్లోకి వస్తాయి. కొంతకాలంగా ధరలు విపరీతంగా పెరిగిపోతున్న దృష్ట్యా, అలాగే చేస్తున్న పనుల దృష్ట్యా తమకు జీతాలు పెంచాలని ఎమ్మెల్యేలు ఎప్పట్నుంచో కోరుతున్నారు. అసెంబ్లీలో జీతాలు పెంచుతూ ఆమ్ ఆద్మీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ప్రతిపక్ష బీజేపీ కూడా మద్దతివ్వడం విశేషం.

Ajit Pawar: ‘మహా’ ప్రతిపక్ష నేతగా అజిత్ పవార్

ప్రస్తుతం ఢిల్లీ అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యేకు జీతం, అలవెన్సులు అన్నీ కలిపి రూ.54,000 వరకు వస్తుండగా, పెంపు నిర్ణయం అమలైతే రూ.90,000 వరకు వచ్చే అవకాశం ఉంది. అయితే, ఈ నిర్ణయం ఇప్పుడు తీసుకున్నదేమీ కాదు. 2015లో దీనిపై ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే విశేష్ రవి ఆధ్వర్యంలోని కమిటీ పంపిన ప్రతిపాదనలను అప్పట్లో కేంద్రం వ్యతిరేకించింది.

ట్రెండింగ్ వార్తలు