Service Charge: సర్వీస్ ఛార్జీల కోసం బలవంతం చేయొద్దు.. రెస్టారెంట్లకు కేంద్రం ఆదేశం

హోటళ్లు, రెస్టారెంట్లు బిల్లులో సర్వీస్ చార్జీలు యాడ్ చేయడానికి వీల్లేదు. సీసీపీఏ ఆదేశానుసారం హోటళ్లు లేదా రెస్టారెంట్లు సర్వీస్ చార్జీలు వసూలు చేయకూడదు. ఫుడ్ బిల్లులో ఆటోమేటిగ్గా లేదా డీఫాల్ట్‌గా కూడా సర్వీస్ చార్జి కలపకూడదు.

Service Charge: సర్వీస్ ఛార్జీల కోసం బలవంతం చేయొద్దు.. రెస్టారెంట్లకు కేంద్రం ఆదేశం

Service Charge

Service Charge: హోటళ్లు, రెస్టారెంట్లలో కస్టమర్ల నుంచి బలవంతంగా సర్వీస్ చార్జీలు వసూలు చేయొద్దని కేంద్రం తాజాగా ఆదేశించింది. వినియోగదారుల హక్కులను పర్యవేక్షించే కేంద్ర సంస్థ అయిన ‘ద సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ)’ ఈ మేరకు సోమవారం మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ అంశంపై కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.

Arvind Kejriwal: గుజరాత్‌లో అధికారంలోకి వస్తే ఉచిత విద్యుత్: అరవింద్ కేజ్రీవాల్

దీని ప్రకారం హోటళ్లు, రెస్టారెంట్లు బిల్లులో సర్వీస్ చార్జీలు యాడ్ చేయడానికి వీల్లేదు. సీసీపీఏ ఆదేశానుసారం హోటళ్లు లేదా రెస్టారెంట్లు సర్వీస్ చార్జీలు వసూలు చేయకూడదు. ఫుడ్ బిల్లులో ఆటోమేటిగ్గా లేదా డీఫాల్ట్‌గా కూడా సర్వీస్ చార్జి కలపకూడదు. అలాగే వేరే ఏ రూపంలోనూ, ఏ పేరుతోనూ వసూలు చేయకూడదు. ఈ విషయంలో ఏ వినియోగదారుడిని బలవంతం చేయకూడదు. స్వతంత్రంగా తమకు తాము మాత్రమే కస్టమర్లు సర్వీస్ చార్జి ఇవ్వొచ్చు. ఈ విషయాన్ని వినియోగదారులకు తెలియజేయాలి. వినియోగదారుల విచక్షణ, స్వతంత్ర నిర్ణయం మీదే సర్వీస్ చార్జి తీసుకోవచ్చు. ఒకవేళ బిల్లులో సర్వీస్ చార్జి వసూలు చేస్తే, దాన్ని తొలగించమని కోరే హక్కు కస్టమర్‌కు ఉంది.

Sidhu Moose Wala: సిద్ధూ హంతకుడు అరెస్టు.. వయస్సు 19 ఏళ్లే!

అయినప్పటికీ హోటళ్లు, రెస్టారెంట్లు సర్వీస్ చార్జి కోసం బలవంతం చేస్తే నేషనల్ కన్స్యూమర్ హెల్ప్‌లైన్ నెంబర్ 1915కు ఫిర్యాదు చేయొచ్చు. లేదా ఎన్‌సీహెచ్ యాప్ ద్వారా కూడా ఫిర్యాదు చేయొచ్చు. వినియోగదారుల కమిషన్‌లో కూడా ఫిర్యాదు చేయొచ్చు. ఇప్పటికే వినియోగదారుల నుంచి ఈ విషయంలో చాలా ఫిర్యాదులు వచ్చాయి. దీంతో కేంద్రం అప్రమత్తమై ఈ విషయంపై చర్చించింది. తాజాగా సర్వీస్ చార్జి వసూలు చేయొద్దని నిర్ణయం తీసుకుంది.