Ajit Pawar: ‘మహా’ ప్రతిపక్ష నేతగా అజిత్ పవార్

సోమవారం జరిగిన బల పరీక్షలో షిండే విజయం సాధించారు. దీంతో షిండే ప్రభుత్వం పూర్తి మెజారిటీతో పాలన సాగించనుంది. ఈ నేపథ్యంలో మొన్నటివరకు అధికారంలో ఉన్న మహా వికాస్ అఘాడి (ఎమ్‌వీఏ) ప్రతిపక్షంగా మారింది. దీంతో కొత్త ప్రతిపక్ష నేతను ఎన్నుకోవాల్సి వచ్చింది.

Ajit Pawar: ‘మహా’ ప్రతిపక్ష నేతగా అజిత్ పవార్

Ajit Pawar

Ajit Pawar: మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యారు ఎన్సీపీ ఎమ్మెల్యే అజిత్ పవార్. ఇంతకుముందు ఆయన ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వంలో రాష్ట్ర డిప్యూటీ సీఎంగా పని చేశారు. ఇటీవల మహారాష్ట్రలో షిండే ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన సంగతి తెలిసిందే. సోమవారం జరిగిన బల పరీక్షలో షిండే విజయం సాధించారు. దీంతో షిండే ప్రభుత్వం పూర్తి మెజారిటీతో పాలన సాగించనుంది. ఈ నేపథ్యంలో మొన్నటివరకు అధికారంలో ఉన్న మహా వికాస్ అఘాడి (ఎమ్‌వీఏ) ప్రతిపక్షంగా మారింది. దీంతో కొత్త ప్రతిపక్ష నేతను ఎన్నుకోవాల్సి వచ్చింది.

Arvind Kejriwal: గుజరాత్‌లో అధికారంలోకి వస్తే ఉచిత విద్యుత్: అరవింద్ కేజ్రీవాల్

ఎమ్‌వీఏలో ఒకప్పుడు శివసేన అత్యధిక సీట్లతో ఉండేది. కానీ, ప్రస్తుతం శివసేన ఎమ్మెల్యేల్లో చాలా మంది తిరుగుబాటు చేయడంతో ఆ పార్టీ రెండుగా చీలింది. ఈ పరిస్థితుల్లో ఎన్సీపీకి అత్యధిక సీట్లు ఉండటంతో ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కింది. తాజాగా ఆ పార్టీ తరఫున అజిత్ పవార్ ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యారు. దీనికి అసెంబ్లీ సెక్రటరీ కూడా ఆమోదం తెలిపారు. కొత్త స్పీకర్‌గా రాహుల్ నార్వేకర్ ఎన్నికైన సంగతి తెలిసిందే.