Sabarimala
Sabarimala Ayyappa Temple: కేరళ ప్రముఖ క్షేత్రమైన శబరిమల అయ్యప్ప ఆయలయానికి భక్తులు తాకిడి పెరిగింది. గత రెండు సంవత్సరాలుగా పరిమిత సంఖ్యలో భక్తులకు అనుమతినిచ్చిన ట్రావెన్ కోర్ బోర్డు ఈ సంవత్సరం భక్తుల పరిమితిని ఎత్తివేయడంతో భారీగా తరలిస్తున్నారు. దీంతో ప్రస్తుతం పదిరోజుల్లోనే శబరిమల ఆలయానికి రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది.
గతేడాది నవంబర్ నెలలో రూ. 9.92 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చిందని ట్రావెన్ కోర్ బోర్డు దేవస్థానం అధ్యక్షుడు అనంతగోపన్ తెలిపారు. అయితే ఈ ఏడాదిమాత్రం గడిచిన పదిరోజుల్లోనే రూ. 52కోట్లు ఆదాయం సమకూరిందని అన్నారు. అప్పం విక్రయాల ద్వారా రూ. 2.58 కోట్లు ఆదాయం, అరవణ విక్రయం ద్వారా రూ. 23.57 కోట్లు, దేవస్థానం హుండీ ద్వారా సుమారుగా రూ. 12.73 కోట్లు ఆదాయం వచ్చిందని ఆయన తెలిపాడు.
Sabarimala Pilgrims: శబరిమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. విమానంలో ఇరుముడి తీసుకెళ్లేందుకు అనుమతి
అయితే ఆలయానికి భక్తుల ద్వారా వ్చచిన ఆదాయాన్ని ఉత్సవాల నిర్వహణకే ఖర్చు చేస్తున్నట్లు అనంతగోపన్ అన్నారు. అయితే ఆలయానికి వచ్చే నాలుగు మార్గాలను తెరిచే ఉంచామని, భక్తులు వారికి ఇష్టమైన మార్గంలో రావొచ్చని ఆయన అన్నారు. శబరిమలకు వచ్చే భక్తులు ఆన్ లైన్, ఆఫ్ లైన్ ద్వారా దర్శనం టికెట్లను పొందవచ్చనని తెలిపారు. లక్కాయం-పంబా రహదారిపై విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశామని, కొండ ఎక్కే ప్రధాన మార్గంలో వచ్చేవారం వరకు పూర్తవుతాయని బోర్డు పేర్కొంది. సన్నిధానం, పంపా, నిలక్కల్ వద్ద అంతరాయం లేకుండా రోజుకు మూడుసార్లు అన్నదానాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేసి అవసరమైన భక్తులకు వైద్య సహాయం అందిస్తున్నట్లు పేర్కొన్నారు.