Sabarimala Special Trains: అయ్యప్పస్వామి భక్తుల సౌకర్యార్థం.. తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు 38ప్రత్యేక రైళ్లు..

అయ్యప్ప స్వామి భక్తుల సౌకర్యార్థం తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే శుక్రవారం ప్రకటించింది.

Sabarimala Special Trains: అయ్యప్పస్వామి భక్తుల సౌకర్యార్థం.. తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు 38ప్రత్యేక రైళ్లు..

South Central Railway

Sabarimala Special Trains: అయ్యప్ప స్వామి భక్తుల సౌకర్యార్థం తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే శుక్రవారం ప్రకటించింది. డిసెంబర్, జనవరి నెలల్లో శమరిమల వెళ్లే అయ్యప్పస్వామి భక్తుల సౌకర్యార్థం 38 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు తెలిపింది.

 

kottayam railway station

kottayam railway station

– డిసెంబర్ 5, 12, 19, 26 తేదీలతో పాటు జనవరి 2,9, 16 తేదీల్లో హైదరాబాద్ – కొల్లాంకు, డిసెంబర్ 6, 13, 20, 27 తేదీల్లో, జనవరి 3, 10, 17 తేదీల్లో కొల్లాం – హైదరాబాద్ కు ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తాయి.

South Central Railway

South Central Railway

– డిసెంబర్ 2, 9, 16, 30 తేదీల్లో, జనవరి 6, 13 తేదీల్లో నర్సాపూర్ – కొట్టాయంకు, డిసెంబర్ 3, 10, 17, 24 తేదీల్లో, జనవరి 7, 14 తేదీల్లో కొట్టాయం నుంచి నర్సాపూర్ కు ప్రత్యేక రైళ్లు నడుస్తాయి.

South Central Railway

South Central Railway

– డిసెంబర్ 4, 11, 18, 25 తేదీల్లో, జనవరి 1,8 తేదీల్లో సికింద్రాబాద్ నుంచి కొట్టాయంకు వరకు. అదేవిధంగా డిసెంబర్ 4, 11, 18, 25 తేదీల్లో, జనవరి 2, 9 తేదీల్లో కొట్టాయం నుంచి సికింద్రాబాద్ కు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.