Worship Shiva with crabs : ఆ దేవాలయంలో శివుడికి పీతలతో అభిషేకం..! వాటితోనే నైవేద్యం..!!

శివుడు అభిషేక ప్రియుడు, కాసిన నీళ్లు పోసినా..ఓ పత్రంతో పూజించినా కరుణించే దేవుడు. అటువంటి శివుడు ఓ ప్రాంతంలో వింత అభిషేకలు అందుకుంటున్నాడు. ఈదేవాలయంలో శివుడిని పీతలతో అభిషేకిస్తారు

devotees worship the lord with crab : పరమ శివుడు, మహాశివుడికి భారతదేశంలోనే కాదు ప్రపంచంలో చాలా దేశాల్లో దేవాయాలు ఉన్నాయి. శివుడిని ఇలాగే పూజించాలనేది ఏమి లేదు. భక్తితో కాసిని నీళ్లు పోసినా కరుణించే దేవుడు శివయ్య. ఓపుష్పమో ఓ పత్రమో భక్తితో సమర్పిస్తే చాలు కోరిక కోరికలు తీర్చే దేవదేవుడాయన. అందుకే శివో అభిషేక ప్రియ: అంటారు. అంటే “శివుడు అభిషేక ప్రియుడు” కాసిని నీళ్ళు లింగంపై పోస్తే సంతోషించి సర్వైశ్వర్యాలను పరమ శివుడు ప్రసాదిస్తాడని భక్తులు నమ్ముతారు. శిశుడు అభిషేక ప్రియుడు కాబట్టి ఎన్నో విధాలుగా అభిషేకించి తరిస్తారు భక్తులు.

Also read : బిర్యానీకి ఫిదా : ఆ గుడిలో ప్రసాదం మటన్ బిర్యానీ

పాలు,పువ్వులు, పంచామృతాలు, విభూది ఇలా దేనితో అభిషేకం చేసినా కటాక్షించేస్తాడు. కోరిన కోరికలు నెరవేరుస్తాడని భక్తులు నమ్ముతారు. సాధారణంగా అభిషేకం అంటే పాలు, పంచామృతాలు, తేనే,పూలు, పండ్లతో చేస్తారు. కానీ గుజరాత్‌ రాష్ట్రం సూరత్‌లోని రుంద్‌నాథ్‌ మహదేవ్‌ ఆలయంలో కొలువైన శివయ్యకు మాత్రం విచిత్రంగా ‘పీతలు’తో అభిషేకం చేస్తారు. ఆ పీతలనే స్వామివారికి నైవేద్యంగా పెడతారు. ఈ ఆనవాయితీ ఎన్నో ఏళ్లుగా జరుగుతోందక్కడ శివయ్యకు.

వినడానికి వింతగా ఉన్నా.. ఇది మాత్రం నిజం. ఆ శివాలయానికి వచ్చే భక్తులంతా స్వామికి నైవేద్యం సమర్పించేందుకు.. ఏ వస్తువులను తీసుకెళ్లకున్నా.. పీతలను మాత్రం విధిగా తీసుకొస్తారు. బతికున్న పీతలతో స్వామికి అభిషేకం చేసిన అనంతరం.. వాటినే స్వామికి నైవేద్యంగా సమర్పిస్తారు.

Also read : Chocolate God ‘Munch Murugan’: చాక్లెట్లే ప్రసాదం..ముడుపుగా చాక్లెట్లే తులాభారం

సూరత్‌లోని రుంద్‌నాథ్‌ మహదేవ్‌ ఆలయంలో స్వామివారికి దర్శించుకోవటానికి నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. రామ్‌నాథ్‌ ఘేలా శ్మశాన వాటికలో ఉన్న ఈ ఆలయంలో ఏడాదికోసారి మాఘమాస ఏకాదశి రోజున పెద్ద ఎత్తున జాతర నిర్వహిస్తుంటారు. ఈ సమయంలో ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయి ఉంటుంది. భక్తులు తమ కోరికలు నెరవేరాలని కోరుకుంటారు. అలా కోరుకుంటూ బతికున్న పీతలను తీసుకొచ్చివాటితో శివుడికి అభిషేకం చేస్తుంటారు.

వేరే ఏ ప్రసాదం తెచ్చినా తేకపోయినా. తేలేకపోయినా స్వామివారికి ఆచారంగా వస్తున్న పీతలను మాత్రం తప్పనిసరిగా తీసుకొస్తుంటారు. ఇలా పీతలతో అభిషేకం,పూజలు చేయడం వల్ల శారీరక రుగ్మతలు నయమవుతాయని భక్తులు నమ్ముతారు. ముఖ్యంగా వైకల్యాలు ఉన్నవారు ఈ దేవదేవడిని దర్శించుకుని పీతలో అభిషేకిస్తే ఆ సమస్యలు తొలగిపోతాయన నమ్మకం. చెవుడు వంటి సమస్యలు కూడా తగ్గిపోతాయని నమ్ముతారట. స్వామికి పూజలు చేసిన తరువాత భక్తులు అక్కడి శ్మశానంలోని వారి వారి బంధువుల సమాధుల వద్ద ప్రార్థనలు నిర్వహిస్తారు.

Also read :

శివయ్యకు ఎన్నో విధాలుగా అభిషేకాలు చేయవచ్చు..వేటితో అభిషేకిస్తే ఏమేమి చేకూరతాయో తెలుసుకుందాం..

ఆవు పాలతో….. సర్వ సౌఖ్యాలు
ఆవు పెరుగు… ఆరోగ్యం, బలం
ఆవు నెయ్యి…. ఐశ్వర్యాభివృద్ధి
చెరకు రసం (పంచదార) …. దుఃఖ నాశనం, ఆకర్షణ
తేనె .. తేజో వృద్ధి
భస్మ జలం.. మహా పాప హరణం
సుగంధోదకం … పుత్ర లాభం
పుష్పోదకం… భూలాభం
బిల్వ జలం … భోగ భాగ్యాలు
నువ్వుల నూనె… అపమృత్యు హరణం
రుద్రాక్షోదకం … మహా ఐశ్వర్యం
సువర్ణ జలం … దరిద్ర నాశనం
అన్నాభిషేకం .. సుఖ జీవనం
ద్రాక్ష రసం …. సకల కార్యాభివృద్ధి

 

 

ట్రెండింగ్ వార్తలు