బిర్యానీకి ఫిదా :  ఆ గుడిలో ప్రసాదం మటన్ బిర్యానీ

  • Published By: veegamteam ,Published On : January 25, 2019 / 10:40 AM IST
బిర్యానీకి ఫిదా  :  ఆ గుడిలో ప్రసాదం మటన్ బిర్యానీ

ఉదయం 5 గంటలకే వేడి వేడి బిర్యానీ 
2వేల కిలోల బాస్మతి రైస్‌ తో మటన్ బిర్యానీ 
83 ఏళ్లుగా వస్తున్న సంప్రదాయం 

వడక్కంపట్టి : గుడిలో ప్రసాదం అంటే పులిహోరా, దద్దోజనం, లడ్డూ, చక్కెర పొంగలి, గారెలు భక్తులకు ప్రసాదంగా పెడతారు. అవి చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకొంచెం పెడితే బాగుండు అనేంత టేస్టీగా ఉంటాయి. సాధారణంగా గుడిలో ప్రసాదం అంటే ప్యూర్ వెజిటేరిన్ మాత్రమే ఉంటుంది. కానీ ఓ గుడిలో మాత్రం నాన్ వెజ్ ప్రసాదం..అదికూడా నోరూరించే మటన్ బిర్యానీని ప్రసాదంగా పెడతారు. ఏంటీ బిర్యానీ అంటే నోరు ఊరిపోతోందా..మీరు కూడా ఆ మటన్ బిర్యానీ ప్రసాదాన్ని తినాలనుకుంటున్నారా..అయితే మీరు వెంటనే తమిళనాడులోని మదురైకు వెళ్లాల్సిందే. ఏంటీ దేవుడితో వేళాకోళం అనుకుంటున్నారా.. కాదండీ కావాలంటే ఆ గుడికి మీరు కూడా వెళ్లి చూడండి..

ఆ గుడిలో మాత్రం వేడి వేడి మటన్‌ బిర్యానీ ప్రసాదంగా పెడతారు. తమిళనాడులోని మదురై జిల్లా తిరుమంగళం తాలుకా వడక్కంపట్టి గ్రామంలో మునియండి అనే దేవాలయం ఉంది. ఈ ఆలయంలో మునియండి స్వామి కొలువుదీరారు. ఆ స్వామికి బిర్యానీ ప్రియుడు అని పేరు అందుకే దేవాలయంలో ఉత్సవాల సందర్భంగా బిర్యానీనే భక్తులకు ప్రసాదంగా పెడతామని ఆర్గనైజర్ మునీశ్వరస్వామి తెలిపారు.మధురై నగరానికి 45 కిలోమీటర్ల దూరంలో వున్న ఈ దేవాలయంలో ప్రతి ఏటా జనవరి 24, 25, 26 తేదీల్లో ఉత్సవాలు పెద్ద ఎత్తున జరుగుతాయి. దానిలో భాగంగా 25న ఉదయం 5 గంటలకే మటన్‌ బిర్యానీ ప్రసాదంగా పెడతారు. అంత పొద్దున బిర్యానీ తినడమే ఇక్కడి ప్రత్యేకత. ఈ ఆచారం 83 ఏళ్లుగా కొనసాగుతోంది. 2వేల కిలోల బాస్మతి రైస్‌, దానికి సరిపడా మటన్‌తో బిర్యానీ తయారు చేసి భక్తులందరికీ అందజేస్తారు. అక్కడ దేవుడి పేరు మీద ప్రారంభించిన ‘శ్రీ మునియండి విలాస్‌’ బిర్యానీ హోటల్‌ కూడా చాలా ఫేమస్‌. ప్రస్తుతం దక్షిణ భారతదేశంలో ‘శ్రీ మునియండి విలాస్‌’ పేరుతో దాదాపు వెయ్యి బ్రాంచీలున్నాయట.