Chocolate God ‘Munch Murugan’: చాక్లెట్లే ప్రసాదం..ముడుపుగా చాక్లెట్లే తులాభారం

  • Published By: nagamani ,Published On : September 29, 2020 / 03:58 PM IST
Chocolate God ‘Munch Murugan’: చాక్లెట్లే ప్రసాదం..ముడుపుగా చాక్లెట్లే తులాభారం

Chocolate God Munch Murugan: పులిహోర, దద్దోజనం, పాయం వంటివి దేవుళ్లకు ప్రసాదాలుగా నైవేద్యాలు పెడతారు. కానీ
కేరళలోని షేమత్ శ్రీ సుబ్రహ్మణ్యం స్వామి ఆలయంలో స్వామికి పెట్టే నైవేద్యానికి చాలా ప్రత్యేకత ఉంది. ఈ స్వామికి నైవేద్యంగా చాక్లెట్లను పెడతారు.



శ్రీ సుబ్రహ్యణ్య స్వామిని దర్శించుకునేందుు వచ్చిన భక్తులు చాక్లెట్లు మాత్రమేతీసుకెళ్లి స్వామికి భక్తితో సమర్పించుకుంటారు. పువ్వులు..పండ్లు ఈ దేవాలయాలోకి తీసుకెళ్లరు..తీసుకెళ్లనివ్వరు.

స్వామికి..చాక్లెట్లకీ లింకేంటి అనే డౌట్ వస్తోంది కదూ? దీని వెనక ఓ చారిత్రాతమ్మక కథ ఉండే ఉంటుందనిపిస్తోంది కదూ..నిజమే..ఈ గుడిలో పూజారులు..స్థానికులు చెప్పిన కథనం ప్రకారంగా చూస్తే..ఓ రోజు ఓ ముస్లిం పిల్లాడు శ్రీ సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలోకి వచ్చాడట. అక్కడ కాసేపు ఆడుకొని గుడిలో ఉండే గంట కొట్టాడు. హిందూ ఆలయంలోకి నువ్వు వెళ్లటమేంటీ అలా వెళ్లకూడదంటూ ఆ పిల్లాడికి తల్లిదండ్రులు తిట్టి కొట్టారు.




అలా ఏడుస్తూ పడుకున్న ఆ పిల్లాడి ఒళ్లంతా సలసలా కాలిపోతూ తీవ్రమైన జ్వరం వచ్చి అనారోగ్యానికి గురయ్యాడు. డాక్టర్ ని తీసుకొచ్చి వైద్యం చేయించినా తగ్గలేదు. దీంతో పిల్లాడు తమకు దక్కితే చాలనుకున్ని స్వామి పట్ల మనం అపరాథం చేశామని పశ్చాత్తాపడి పిల్లాడితోపాటూ… తల్లిదండ్రులు కూడా మురుగన్ స్వామి పేరును రాత్రంతా జపించారట.

తెల్లారే సరికి పిల్లాడికి జ్వరం తగ్గిపోయింది. ఆరోగ్యంగా తిరుగుతుంటే చూసిన తల్లిదండ్రులు ఇదంతా స్వామి మహిమే అయి ఉంటుందని..పిల్లాణ్ని చక్కగా ముస్తాబు చేసి తాము కూడా చక్కగా తయారుచేసి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి తీసుకెళ్లారు. అక్కడ పూజారితో ఇదే విషయం చెప్పారు. ‘‘మరి నీకు అనారోగ్యం పోయింది కదా… మరి స్వామికి ఏమి ఇస్తావు అని అడిగారట. అందుకు ఆ పిల్లాడు మామూలుగా పిల్లలు లాగే స్వామికి ఓ చాక్లెట్ ఇస్తానని చెప్పి చాక్లెట్ కొని స్వామికి సమర్పించాడట.



ఇక అప్పటి నుంచి అంతా స్వామికి చాక్లెట్లే ఇస్తున్నారు. 300 ఏళ్ల నాటి ఈ ఆలయంలో… ఆరేళ్ల నుంచి ఈ చాక్లెట్ నైవేద్యాలు..ప్రసాదాల సంస్కృతి మొదలైందట. అప్పటి నుంచి శ్రీ సుబ్రహ్మణ్యస్వామిని ‘మంచ్ మురుగన్’ అని పిలుస్తున్నారు.