Dil Raju Slams On Trolls On Him About Karthikeya 2
Dil Raju Slams On Trolls: టాలీవుడ్‌లో ఇటీవల సినిమా రిలీజ్‌లు చాలా కష్టం మీద అవుతున్నాయి. ఈ క్రమంలోనే రిలీజ్ అయిన సీతా రామం, బింబిసార చిత్రాలు అందరినీ అవాక్కయ్యేలా చేస్తూ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నాయి. ఇక ఈ రెండు సినిమాలు అందుకున్న సక్సెస్ కారణంగా గతవారం మాచర్ల నియోజకవర్గం, కార్తికేయ-2 సినిమాలు కూడా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యాయి. అయితే ఈ రెండింటిలో మాచర్ల నియోజకవర్గం ప్రేక్షకులను అలరించడంలో వెనుకబడిపోయింది.
Dil Raju : బింబిసార, సీతారామం ఇండస్ట్రీకి ప్రాణం పోశాయి.. సినిమాకి హీరో, దర్శకుడు, నిర్మాతే ముఖ్యం..
కానీ కర్తికేయ2 చిత్రం మాత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమా రిలీజ్ ఆలస్యం అవడానికి అనేక కారణాలు ఉన్నాయని.. అందులో స్టార్ ప్రొడ్యూసర్ కమ్ డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు కూడా ఒకరనే వార్త ఇండస్ట్రీ వర్గాల్లో గతకొంత కాలంగా వినిపిస్తూ వచ్చింది. అయితే కార్తికేయ2 చిత్ర రిలీజ్‌ను దిల్ రాజు ఆపలేకపోయాడని.. కంటెంట్ బాగుంటే, ఏ సినిమాను ఎవరూ ఆపలేరని సోషల్ మీడియాలో దిల్ రాజుపై ట్రోల్స్ వచ్చాయి. తాజాగా ఈ ట్రోల్స్‌పై దిల్ రాజు స్పందించాడు.
Dil Raju : మాలోమాకు గొడవలు లేవు.. మా షూటింగ్స్ మేమే ఆపుకున్నాం..
కార్తికేయ 2 సక్సెస్ మీట్‌లో పాల్గొన్న దిల్ రాజు, కార్తికేయ2 చిత్రాన్ని తాను ఆపే ప్రయత్నం చేశానంటూ కొన్ని మీడియా సైట్లు పేర్కొన్నాయని.. అది పూర్తిగా అబద్ధం అని ఆయన మండిపడ్డారు. ఇలా తలాతోకా లేని వార్తలను ప్రేక్షకులపై ఎందుకు రుద్దుతున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక సినిమా రిలీజ్ అయితే తాను కూడా ఎంతో సంతోషిస్తానని.. అలాంటిది తనపై ఇలాంటి ట్రోల్స్ రావడం బాధాకరంగా ఉందని దిల్ రాజు అన్నారు. ఏదేమైనా ఇలాంటి వార్తలు రాసేముందు ఒకటికి రెండు సార్లు అందులో ఎంతవరకు నిజం ఉందో తెలుసుకుని రాయాలని దిల్ రాజు కోరారు. మొత్తానికి కార్తికేయ-2 సినిమా రిలీజ్‌ను ఆపే ప్రయత్నం దిల్ రాజు చేశారంటూ వచ్చిన వార్తలకు ఆయన గట్టిగానే సమాధానం ఇచ్చారు.