Dil Raju : మాలోమాకు గొడవలు లేవు.. మా షూటింగ్స్ మేమే ఆపుకున్నాం..

దిల్ రాజు మాట్లాడుతూ.. ''మాలో మాకు ఎలాంటి గొడవలు లేవు. చిత్ర పరిశ్రమకు తెలుగు ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్సే సుప్రీమ్. ఫిలిం ఛాంబర్ మాత్రమే డెసిషన్ మేకర్. ఇక నుంచి ఏ అప్డేట్ అయినా........

Dil Raju : మాలోమాకు గొడవలు లేవు.. మా షూటింగ్స్ మేమే ఆపుకున్నాం..

Dil Raju :  టాలీవుడ్ సమస్యలకి వరుస సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. సమస్యలకి పరిష్కారం దొరికేదాకా షూటింగ్స్ నిలిపివేశారు. అయితే నిర్మాతల మండలికి, ఫిలిం ఛాంబర్ కి మధ్య బేధాభిప్రాయాలు వచ్చాయి ఈ విషయంలో. వరుస సమావేశాలు నిర్వహిస్తున్న తరుణంలో తాజాగా ప్రొడ్యూసర్ కౌన్సిల్, ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ కలిసి సమావేశం నిర్వహించాయి.

ఈ సమావేశంలో దిల్ రాజు మాట్లాడుతూ.. ”మాలో మాకు ఎలాంటి గొడవలు లేవు. చిత్ర పరిశ్రమకు తెలుగు ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్సే సుప్రీమ్. ఫిలిం ఛాంబర్ మాత్రమే డెసిషన్ మేకర్. ఇక నుంచి ఏ అప్డేట్ అయినా ఫిలిం ఛాంబర్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ ద్వారానే వస్తుంది. ప్రస్తుతం అన్ని సినిమాల చిత్రీకరణలు ఆగాయి. త్వరలోనే సమస్యలను పరిష్కరించి, షూటింగ్ లు మొదలుపెడతాం. తెలుగు నిర్మాతలు అందరం కలసి ఆగస్ట్ 1నుండి మా షూటింగ్స్ అపుకున్నాం.

Sita Ramam: సీతా రామం ప్రీరిలీజ్ బిజినెస్ రిపోర్ట్

కొన్ని సమావేశాల తర్వాత నాలుగు టీమ్ లు ఏర్పాటు చేసుకున్నాం. ఓటిటికి సినిమాలు ఎన్ని వారాల తర్వాత వెళ్తే బెటర్ అనే దానిపై ఒక కమిటీ వేశాము. థియేటర్ లో vpf చార్జెస్, పర్సంటేజెస్ ఎలా ఉండాలి అనేదానపై ఒక కమిటీ, వేతనాలు ఎలా ఉండాలి అనే దానిపై ఒక కమిటీ, నిర్మాతలకు ప్రొడక్షన్ లో వేస్టజ్ ఏం ఉంది, షూటింగ్ మొదలు లాస్ట్ వరకు ఎలా ఉండాలి అనే దానిపై ఒక కమిటీ వేశాము. మేము ఇప్పుడు చేస్తున్నదంతా ప్రేక్షకులను థియేటర్ కు తీసుకురావడానికే. నాపై భాద్యతలు పెట్టారు, నాకు ఎలాంటి పర్సనల్ ఎజెండా లేదు అని తెలిపారు.”