Sita Ramam: సీతా రామం ప్రీరిలీజ్ బిజినెస్ రిపోర్ట్

మలయాళ హీరో దుల్కర్ సల్మాన్, మృణాల్‌ ఠాకూర్‌ హీరోహీరోయిన్లుగా, అందాల భామ రష్మిక మందన కీలక పాత్రలో నటిస్తున్న ‘సీతా రామం’ ఇప్పటికే భారీ అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమా ఆగస్టు 5న రిలీజ్ అవుతుండటంతో, ప్రీరిలీజ్ బిజినెస్ భారీగా జరిగినట్లు చిత్ర యూనిట్ తెలిపింది.

Sita Ramam: సీతా రామం ప్రీరిలీజ్ బిజినెస్ రిపోర్ట్
ad

Sita Ramam: టాలీవుడ్ డైరెక్టర్ హను రాఘవపూడి తెరకెక్కించిన లేటెస్ట్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీ ‘సీతా రామం’ ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలను క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ చిత్ర టీజర్, ట్రైలర్లు ఆకట్టుకునే విధంగా ఉండటంతో ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మలయాళ హీరో దుల్కర్ సల్మాన్, బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ జంటగా ఈ సినిమాను తెరకెక్కించగా, నేషనల్ క్రష్ రష్మిక మందన ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ఇక ఈ సినిమా ఆగస్టు 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌కు రెడీ అయ్యింది.

Sita Ramam: ‘సీతా రామం’ ప్రీరిలీజ్ ఈవెంట్ ఫోటోలు

ఇప్పటికే పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసిన ‘సీతా రామం’ మూవీ ప్రీరిలీజ్ బిజినెస్ కూడా భారీగా జరిగినట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాను వైజయంతి మూవీస్, స్వప్న సినిమా సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తుండగా, ఈ చిత్రాన్ని ఆగస్టు 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. కాగా, ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.18.70 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న సీతా రామం బ్రేక్ ఈవెన్‌కు రావాలంటే రూ.19.50 కోట్లు వసూలు చేయాల్సిన అవసరం ఉంది.

Sita Ramam: సీతా రామం అక్కడ బ్యాన్..?

సుమంత్, భూమిక చావ్లా, ప్రకాశ్ రాజ్, తరుణ్ భాస్కర్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా, ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఏరియాల వారీగా ఈ చిత్ర ప్రీరిలీజ్ బిజినెస్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

నైజాం – 5 కోట్లు
సీడెడ్ – 2 కోట్లు
ఆంధ్ర – 7 కోట్లు
టోటల్ ఏపీ+తెలంగాణ – రూ.14 కోట్లు
కర్ణాటక + రెస్టాఫ్ ఇండియా – 0.70 కోట్లు
ఓవర్సీస్ – 2.5 కోట్లు
ఇతర భాషలు – 1.50 కోట్లు
టోటల్ వరల్డ్‌వైడ్ ప్రీరిలీజ్ బిజినెస్ – రూ.18.70 కోట్లు