Dil Raju : బింబిసార, సీతారామం ఇండస్ట్రీకి ప్రాణం పోశాయి.. సినిమాకి హీరో, దర్శకుడు, నిర్మాతే ముఖ్యం..

బింబిసార సక్సెస్ మీట్ లో దిల్ రాజు మాట్లాడుతూ.. ''ఆగస్టు 1 నుంచి సినిమా షూటింగ్స్ లు నిలిపివేసి భవిష్యత్ కోసం ఆలోచనలు చేస్తున్నాం. జూన్ లో విక్రమ్, మేజర్ సినిమాలు..........

Dil Raju : బింబిసార, సీతారామం ఇండస్ట్రీకి ప్రాణం పోశాయి.. సినిమాకి హీరో, దర్శకుడు, నిర్మాతే ముఖ్యం..

dil raju

Dil Raju :  కొన్ని రోజులుగా వరుస ఫ్లాపులని ఎదుర్కుంటున్న టాలీవుడ్ కి ఇటీవల రిలీజ్ అయిన బింబిసార, సీతారామం సినిమాలు హిట్ కొట్టి ఊపిరి పోశాయి. దీంతో టాలీవుడ్ ప్రముఖులంతా ఈ సినిమాలని, చిత్ర యూనిట్స్ ని అభినందిస్తున్నారు. రెండు చిత్ర యూనిట్స్ సక్సెస్ మీట్స్ నిర్వహిస్తున్నాయి. ఇక సినీ పరిశ్రమ సమస్యలని పరిష్కరించడానికి ముందుండి నడిపిస్తున్న అగ్ర నిర్మాత దిల్ రాజు కూడా తాజాగా బింబిసార సక్సెస్ మీట్ లో పాల్గొని ఈ రెండు సినిమాల సక్సెస్ పై మాట్లడారు.

Venu Tottempudi : మరో సూపర్ ఛాన్స్ కొట్టేసిన వేణు తొట్టెంపూడి.. 22 ఏళ్ళ తర్వాత ఆ డైరెక్టర్ తో??

బింబిసార సక్సెస్ మీట్ లో దిల్ రాజు మాట్లాడుతూ.. ”ఆగస్టు 1 నుంచి సినిమా షూటింగ్స్ లు నిలిపివేసి భవిష్యత్ కోసం ఆలోచనలు చేస్తున్నాం. జూన్ లో విక్రమ్, మేజర్ సినిమాలు మంచి విజయాలు అందుకున్నాయి. ఆ తర్వాత నుంచి ఒక్క సినిమా కూడా ఆడలేదు, జనాలు థియేటర్లకు రావడం లేదు. ఆగస్టులో బింబిసార, సీతారామం సినిమాలు ఇండస్ట్రీకి ఊపిరిపోశాయి. సినీ పరిశ్రమ చాలా ఇబ్బందుల్లో ఉందనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఇండస్ట్రీ కష్టకాలంలో ఉన్న సమయంలో దర్శకుడు వశిష్ట ఇండస్ట్రీకి హిట్ ఇచ్చాడు. ఒక సినిమాకు దర్శకుడు, నిర్మాత, హీరోనే ముఖ్యం. ఈ ముగ్గురు ఉంటేనే సినిమాని ఏ స్థాయికైనా తీసుకెళ్లొచ్చు” అని అన్నారు.