Sekhar Kammula: వాట్సాప్ వాడని ఒకేఒక్క తెలుగు దర్శకుడు!

సినిమా వాళ్లంటే ఆ హంగు ఆర్భాటమే వేరుగా ఉంటుంది. ముఖ్యంగా పార్టీలు, ఫంక్షన్లు అంటూ అందరితో కలివిడిగా ఉంటూ కాస్త ప్రాశ్చాత్య పోకడలకు దగ్గరగా ఉంటారు. అయితే.. ఒకే ఒక దర్శకుడు మాత్రం సోషల్ మీడియా సంగతి దేవుడెరుగు కానీ కనీసం వాట్సాప్ కూడా ఉపయోగించరట.

Sekhar Kammula: వాట్సాప్ వాడని ఒకేఒక్క తెలుగు దర్శకుడు!

Director Sekhar Kammula

Updated On : April 13, 2021 / 2:02 PM IST

Director Sekhar Kammula: సినిమా వాళ్లంటే ఆ హంగు ఆర్భాటమే వేరుగా ఉంటుంది. ముఖ్యంగా పార్టీలు, ఫంక్షన్లు అంటూ అందరితో కలివిడిగా ఉంటూ కాస్త ప్రాశ్చాత్య పోకడలకు దగ్గరగా ఉంటారు. అలా ఉండని సెలబ్రిటీలు ఎవరైనా ఉంటే ఇండస్ట్రీలో కాస్త వెనకబడిపోతారని భావిస్తారు. ఇక సోషల్ మీడియా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ఇప్పుడు దాదాపుగా సినీ సెలబ్రిటీలందరూ సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్ అనే చెప్పుకోవాలి. అయితే.. ఒకే ఒక దర్శకుడు మాత్రం సోషల్ మీడియా సంగతి దేవుడెరుగు కానీ కనీసం వాట్సాప్ కూడా ఉపయోగించరట. ఆయన ఎవరో కాదు శేఖర్ కమ్ముల.

సాధారణంగా ఇప్పుడు వాట్సాప్ లేని స్మార్ట్ ఫోన్ ఊహించుకోవడం కష్టమే. అది కూడా శేఖర్ కమ్ముల లాంటి దర్శకుడికి స్మార్ట్ ఫోన్, వాట్సాప్ పెద్ద కష్టమేం కాదు. కానీ ఆయన మాత్రం దానికి దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యారట. దీని వలన కొన్నిసార్లు పెద్ద చిక్కులే వచ్చినా శేఖర్ మాత్రం ఛాన్సే లేదు దానికి మాత్రం దూరమే అంటున్నాడు. అయితే.. ఎందుకిలా నిర్ణయించుకున్నాడు.. వాట్సాప్ వాడకపోవడం వలన వచ్చిన సమస్యలేంటి అనేది కూడా శేఖర్ కమ్ములనే స్వయంగా చెప్పుకొచ్చాడు. రానా హోస్ట్ గా ఆహాలో ప్రసారమయ్యే No.1 యారీ కార్యక్రమంలో ఈ విషయాలను పంచుకున్నారు.

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య-సాయిపల్లవి జంటగా తెరకెక్కిన లవ్ స్టోరీ సినిమా ప్రమోషన్ లో భాగంగా రానా కార్యక్రమానికి వచ్చిన శేఖర్ కమ్ములను ఉద్దేశిస్తూ.. మీరూ లవ్‌ ఎమోజీ ఎప్పుడు వాడారని రానా అడగ్గా వెంటనే చైతూ కల్పించుకొని.. ‘అసలు శేఖర్‌గారికి వాట్సాప్‌ లేదు. వాట్సాప్‌ మెసెజ్‌కు రిప్లై ఇవ్వరని ఆయనను చాలామంది అపార్థం చేసుకుంటున్నారు’ అని చెప్పాడు. అయితే తాను కూడా వాట్సాప్‌ ఇన్‌స్టాల్‌ చేసుకుంటా శేఖర్‌ కమ్ముల అనబోతుండగా.. మళ్లీ చైతూ కల్పించుకొని ‘వద్దు శేఖర్‌ మీరు ఇలాగే ఉండండి’ అనడంతో కార్యక్రమంలో నవ్వులు పూశాయి. మొత్తంగా మరోసారి వాట్సాప్ వాడని ఒకే ఒక్క దర్శకుడు శేఖర్ కమ్ముల మాత్రమేనని సోషల్ మీడియాలో తెగ వారియర్ అవుతుంది.

read: Vakeel Saab OTT Release: ఓటీటీలో వకీల్ సాబ్.. అసలు విషయం ఇదే!