Vakeel Saab OTT Release: ఓటీటీలో వకీల్ సాబ్.. అసలు విషయం ఇదే!

టాలీవుడ్ లో ఇప్పుడు ఏం నడుస్తుందటే రెండు నడుస్తున్నాయి. ఒకటి కరోనా.. మరొకటి వకీల్ సాబ్ మేనియా. వీళ్ళు వాళ్ళు అని లేకుండా వరసబెట్టి దర్శక, నిర్మాతల నుండి హీరోలు, హీరోయిన్స్ వరకు కరోనా మహమ్మారి బారిన పడుతుంటే వైరస్ ఇంత వ్యాప్తి చెందుతున్నా.. వకీల్ సాబ్ కలెక్షన్లు మాత్రమే దూసుకెళ్తూనే ఉన్నాయి.

Vakeel Saab OTT Release: ఓటీటీలో వకీల్ సాబ్.. అసలు విషయం ఇదే!

Vakeel Saab Ott Release

Vakeel Saab OTT Release: టాలీవుడ్ లో ఇప్పుడు ఏం నడుస్తుందటే రెండు నడుస్తున్నాయి. ఒకటి కరోనా.. మరొకటి వకీల్ సాబ్ మేనియా. వీళ్ళు వాళ్ళు అని లేకుండా వరసబెట్టి దర్శక, నిర్మాతల నుండి హీరోలు, హీరోయిన్స్ వరకు కరోనా మహమ్మారి బారిన పడుతుంటే వైరస్ ఇంత వ్యాప్తి చెందుతున్నా.. వకీల్ సాబ్ కలెక్షన్లు మాత్రమే దూసుకెళ్తూనే ఉన్నాయి. కరోనా వ్యాప్తి ఉదృతంగా ఉందని రోజూ ప్రభుత్వాలు విడుదల చేసే లెక్కలు చెప్తున్నా వకీల్ సాబ్ థియేటర్స్ మాత్రం హౌస్ ఫుల్ అవుతున్నాయి. పవర్ స్టార్ క్రేజ్.. వకీల్ మేనియా తోడై సినిమా బంపర్ హిట్ దిశగా దూసుకెళ్తుంది.

సాధారణ టికెట్ల ధరలలో కూడా వకీల్ సాబ్ వసూళ్లలో సరికొత్త రికార్డులను నెలకొల్పోడం ఖాయంగా కనిపిస్తుండగా ఇదే సమయంలో మరో పదిరోజుల్లోనే వకీల్ సాబ్ ఓటీటీలో వస్తాడని సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతుంది. సినిమా విడుదల అనంతరం రెండు వారాల తర్వాతనే ఓటీటీలో విడుదల చేసుకోవచ్చని నిర్మాత దిల్ రాజు సినిమా విడుదలకు ముందే ఒప్పందం చేసుకున్నాడని ప్రచారం జరుగుతూ వచ్చింది. చేసుకున్న ఒప్పందం ప్రకారం సినిమా ఏప్రిల్ 23న ఓటీటీలో విడుదల కానుందని డేట్ కూడా ఫిక్స్ చేసుకున్నారు.

ఇలాంటి పాండమిక్ సమయంలో కూడా సినిమా థియేటర్లలో ఇంత బాగా రన్ అవుతుండగా ఇప్పుడే ఓటీటీలో విడుదల చేయడం ఏమిటని కొందరు అభిమానులు ఈ విషయాన్ని నిర్మాతల దృష్టికి తీసుకెళ్లడంతో నిర్మాణ సంస్థ స్పందించింది. మరో పదిరోజుల్లోనే ఓటీటీలో సినిమా వస్తుందనేది.. తప్పుడు వార్తలని, అస్సలు నమ్మవద్దని, సినిమాను ఇప్పుడప్పుడే ఓటీటీలో రిలీజ్ చేసే ఆలోచన లేదని చెప్పారు. మరికొన్ని రోజులు సినిమా చూడాలంటే థియేటర్లకు వెళ్లాల్సిందేనని తేల్చి చెప్పారు. సినిమాకు వస్తున్న ఆదరణను చూడలేకనే ఒక వర్గం ఈ తరహా ప్రచారం చేస్తుండగా అభిమానులు ఎప్పటికప్పడు దీన్ని తిప్పికొడుతున్నారు.