Director Teja : ఉదయ్ కిరణ్ చావుకి కారణాలు నాకు తెలుసు.. టైం వచ్చినప్పుడు బయటపెడతా.. తేజ సంచలన వ్యాఖ్యలు..
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు తేజ ఉదయ్ కిరణ్ గురించి మాట్లాడుతూ.. ''ఉదయ్ కిరణ్ చాలా సున్నితమైన మనస్తత్వం ఉన్నోడు, అమాయకుడు. వరుసగా మూడు హిట్ లు వచ్చేసరికి కెరీర్ ని సరిగ్గా బ్యాలెన్స్ చేసుకోలేకపోయాడు. తను ప్లాప్‌లతో ఉన్న సమయంలో...........
- Saketh U
- Published On : November 19, 2022 / 07:40 AM IST
Director Teja sensational comments on uday kiran
Director Teja : చిత్రం సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన ఉదయ్ కిరణ్ ఆ తర్వాత నువ్వే నువ్వే, మనసంతా నువ్వే సినిమాలతో స్టార్ హీరోగా ఎదిగాడు. అప్పట్లో ఉదయ్ కిరణ్ కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. ఆ తర్వాత కొన్ని ఫ్లాప్ సినిమాలు రావడంతో ఉదయ్ కిరణ్ కెరీర్ డైలమాలో పడింది. అదే సమయంలో పెళ్లి, ఆర్ధిక సమస్యలు, కుటుంబ సమస్యలతో సతమతమయ్యాడు ఉదయ్ కిరణ్.
అకస్మాత్తుగా 2014లో ఆత్మహత్య చేసుకొని మరణించాడు ఉదయ్ కిరణ్. ఉదయ్ కిరణ్ ఆత్మహత్య ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. ఉదయ్ కిరణ్ చనిపోవడానికి చాలా మంది అనేక కారణాలు చెప్పారు. ఆయన చనిపోయి 8 ఏళ్ళు అవుతున్న ఇప్పటికి ఎక్కడో ఒక చోట ఆయన మరణం గురించి వార్త వస్తూనే ఉంటుంది. తాజాగా ఉదయ్ కిరణ్ ని హీరోగా చేసి లైఫ్ ఇచ్చిన దర్శకుడు తేజ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఉదయ్ కిరణ్ ఆత్మహత్యపై సంచలన వ్యాఖ్యలు చేశాడు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు తేజ ఉదయ్ కిరణ్ గురించి మాట్లాడుతూ.. ”ఉదయ్ కిరణ్ చాలా సున్నితమైన మనస్తత్వం ఉన్నోడు, అమాయకుడు. వరుసగా మూడు హిట్ లు వచ్చేసరికి కెరీర్ ని సరిగ్గా బ్యాలెన్స్ చేసుకోలేకపోయాడు. తను ప్లాప్‌లతో ఉన్న సమయంలో నేనే పిలిచి ‘ఔనన్నా కాదన్నా’ సినిమాలో అవకాశం ఇచ్చాను. ఆ సినిమా షూటింగ్ సమయంలో నాతో చాలా మాట్లాడాడు, చాలా విషయాలు షేర్ చేసుకొని బాధపడ్డాడు. నా విషయంలో తప్పు చేశానని, నా పాదాలు పట్టుకొని క్షమించమని అడిగాడు. ఉదయ్ కిరణ్ జీవితంలో ఏం జరిగిందో అంతా నాకు తెలుసు. నాకు అన్ని విషయాలు చెప్పేవాడు. ఉదయ్ కిరణ్ ఆత్మహత్యకు కారణాలు ఏంటో సమయం వచ్చినప్పుడు నేను బయటపెడతాను. నేను చనిపోయేలోపు అయినా ఆ విషయాలను చెప్తాను” అని అన్నారు.
దీంతో తేజ చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఉదయ్ కిరణ్ ఆత్మహత్యకి గల కారణాలేంటో అని మరోసారి చర్చగా మారింది. తేజ ఏం చెప్తాడు, ఎప్పుడు చెప్తాడు అని అందరూ ఎదురు చూస్తున్నారు. మరి తేజ ఎలాంటి సంచలన నిజాలు బయటపెడతాడో చూడాలి.
