Vignesh Shivan : నయనతార బర్త్‌డే.. నిన్ను, మన పిల్లలని ప్రేమిస్తూనే ఉంటా.. విగ్నేష్ శివన్ స్పెషల్ పోస్ట్..
Vignesh Shivan : విఘ్నేశ్ శివన్ నయనతారతో కలిసి దిగిన ఫోటోలు తన ఇన్‌స్టాలో షేర్ చేసి.. నాతో ఇది నీ తొమ్మిదో పుట్టినరోజు. ప్రతి పుట్టిన రోజు మనకి చాలా మెమరబుల్. కానీ ఈ పుట్టినరోజు నాకు మరింత స్పెషల్. ఈ సంవత్సరమే మనం భార్య, భర్తలుగా కొత్త జీవితాన్ని ప్రారంభించాం.

Vignesh Shivan special post on nayanathara birthday
Vignesh Shivan : లేడీ సూపర్ స్టార్ నయనతార తెలుగు, తమిళ్ లో సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. కొన్నేళ్లుగా దర్శకుడు విగ్నేష్ శివన్ ని ప్రేమించి కొన్ని నెలల క్రితం పెళ్లి చేసుకుంది. ఇటీవలే సరోగసి ద్వారా ఇద్దరు పిల్లలకి తల్లి అయింది. ప్రస్తుతం ఓ వైపు ఫ్యామిలీ లైఫ్ ని ఆస్వాదిస్తూనే మరోవైపు సినిమాలతో కూడా బిజీగా ఉంది నయన్.
నిన్న శనివారం నయనతార పుట్టిన రోజు కావడంతో అభిమానులు, ప్రేక్షకులు, పలువురు ప్రముఖులు ఆమెకి విషెష్ తెలిపారు. భర్త విగ్నేష్ శివన్ నయన్ పుట్టిన రోజుకి స్పెషల్ ఫోటోషూట్ చేసి తన సోషల్ మీడియాలో స్పెషల్ గా పోస్ట్ చేశాడు.
Samantha : యశోద సక్సెస్ పై సమంత ఎమోషనల్ పోస్ట్.. ప్రేమతో మీ సమంత..
విఘ్నేశ్ శివన్ నయనతారతో కలిసి దిగిన ఫోటోలు తన ఇన్‌స్టాలో షేర్ చేసి.. ” నాతో ఇది నీ తొమ్మిదో పుట్టినరోజు. ప్రతి పుట్టిన రోజు మనకి చాలా మెమరబుల్. కానీ ఈ పుట్టినరోజు నాకు మరింత స్పెషల్. ఈ సంవత్సరమే మనం భార్య, భర్తలుగా కొత్త జీవితాన్ని ప్రారంభించాం. అలాగే ఇద్దరు పిల్లలకు తల్లితండ్రులయ్యాం. నీ ఆత్మవిశ్వాసం, అంకితభావం, జీవితం పట్ల నిజాయితీ, చిత్తశుద్ధి నుంచి నేను ప్రేరణ పొందాని. నిన్ను ఒక తల్లిగా చూడడం నా జీవితంలో అత్యంత సంతోషకరమైన రోజు.
ప్రస్తుతం నిన్ను మేకప్ వేసుకోకుండా కూడా ఇంత అందంగా ఇంతవరకు నేను ఎప్పుడూ చూడలేదు. మన పిల్లలు ముద్దు పెట్టుకుంటారనే నువ్వు మేకప్ వేసుకోవడం లేదు. నీ ముఖంలో అందం, చిరునవ్వు ఇలాగే శాశ్వతంగా ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నా. రాబోయే పుట్టినరోజులు మరింత సంతోషంగా ఉండాలనేదే నా ఆశ. దేవుని అశీర్వాదాలతో మన జీవితం మరింత అద్భుతంగా సాగాలని కోరుకుంటున్నా. ఇప్పటికీ, ఎప్పటికీ నా ప్రియమైన పొండాయాటి, పిల్లలను ప్రేమిస్తూనే ఉంటాను” అని ఎమోషనల్ గా పోస్ట్ చేశాడు. దీంతో విగ్నేష్ శివన్ పోస్ట్, ఫోటోలు వైరల్ గా మారాయి.
View this post on Instagram