Samantha : యశోద సక్సెస్ పై సమంత ఎమోషనల్ పోస్ట్.. ప్రేమతో మీ సమంత..

తాజాగా యశోదా సక్సెస్ పై సమంత స్పందిస్తూ ఓ లెటర్ ని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ లెటర్లో.. ''ప్రియమైన ప్రేక్షకులారా, నేను అడిగినట్లు యశోద పట్ల మీ ప్రశంసలు మరియు ప్రేమ..............

Samantha : యశోద సక్సెస్ పై సమంత ఎమోషనల్ పోస్ట్.. ప్రేమతో మీ సమంత..

Samantha emotional post on yashoda movie success

Samantha :  సమంత మెయిన్ లీడ్ లో ఇటీవల తమిళ దర్శకులు హరి -హరీష్ దర్శకత్వంలో తెరకెక్కిన యశోద సినిమా రిలీజయి మంచి విజయం సాధించింది. ట్విస్టులు, సస్పెన్స్ అంశాలు ఉండటంతో ఈ సినిమా బాగా రీచ్ అయింది. ఫిమేల్ ఓరియెంటెడ్ గా తెరకెక్కిన యశోద సినిమాని సమంత తన భుజాలపై మోసిందని చెప్పొచ్చు. ఇటీవలే ఈ సినిమా సక్సెస్ మీట్ కూడా నిర్వహించారు. అన్ని కుదిరితే యశోద సినిమాకి సీక్వెల్ కూడా తీస్తామని చిత్ర దర్శకులు ప్రకటించారు.

Balakrishna : విశ్వక్ కోసం వచ్చిన బాలయ్య.. మరోసారి ఆదిత్య సీక్వెల్ పై క్లారిటీ.. వచ్చే ఏడాదే..

తాజాగా యశోదా సక్సెస్ పై సమంత స్పందిస్తూ ఓ లెటర్ ని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ లెటర్లో.. ”ప్రియమైన ప్రేక్షకులారా, నేను అడిగినట్లు యశోద పట్ల మీ ప్రశంసలు మరియు ప్రేమ నాకు గొప్ప బహుమతి మరియు మద్దతు ఇచ్చింది. నేను ఆనందం, కృతజ్ఞతతో పొంగిపోయాను. మీ ఈలలు వినడం మరియు థియేటర్లలో వేడుకలు చూడటం యశోద బృందం మొత్తం పడిన కష్టానికి తగిన సాక్ష్యం! నేను ఈ ఆనందంతో మేఘాలలో విహరిస్తున్నాను. యశోద మేకింగ్‌లో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నన్ను నమ్మి ఈ సినిమాని నిర్మించిన నిర్మాత కృష్ణ ప్రసాద్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే దర్శకులు హరి, హరీష్‌లతో కలిసి పనిచేయడం నాకు చాలా ఆనందాన్నిచ్చింది. ఇంత మంచి సినిమా ఇచ్చినందుకు దర్శకులకు కూడా నా కృతజ్ఞతలు. నా ప్రియమైన సహనటులు వరలక్ష్మి శరత్‌కుమార్‌ గారు, ఉన్ని ముకుందన్‌ గారు మరియు మిగిలిన అద్భుతమైన నటీనటులకు కూడా మీతో కలిసి పని చేయడం అద్భుతంగా ఉంది. వినయంగా మరియు ఎప్పుడూ కృతజ్ఞతతో.. ప్రేమతో.. సమంత” అని ఎమోషనల్ గా పోస్ట్ చేసింది.