Headache While Waking Up : ఉదయం నిద్రలేస్తూనే తలనొప్పి సమస్య బాధిస్తుందా?

శరీరంలో ఆక్సిజన్ తగినంత లేకపోయినా కూడా తలనొప్పి తో పాటు బలహీనత మైకం కూడా వస్తుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ ను పరిశీలించాలి. అవి తక్కువగా ఉంటే మాత్రం ఉదయం తలనొప్పి వస్తుంది. డిహైడ్రేషన్ సమస్యతో బాధపడుతున్న వారిలో ఉదయాన్నే తలనొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Headache While Waking Up : ఉదయం నిద్రలేస్తూనే తలనొప్పి సమస్య బాధిస్తుందా?

headache while waking up

Headache While Waking Up : సాధారణంగా తలనొప్పి అందరికీ వచ్చే ఆరోగ్య సమస్య. కాకపోతే కొంతమందికి ఉదయం నిద్ర లేచిన వెంటనే తరచుగా తలనొప్పి వస్తూ ఉంటుంది. ఉదయం తలనొప్పి వివిధ కారణాల వల్ల సంభవించవచ్చు. పేలవమైన రాత్రి నిద్ర , ఒత్తిడిని ఎదుర్కొంటున్నప్పుడు ఈ తలనొప్పిని వస్తుంది. అయితే దీనిని సాధారణమైనదిగా భావించి నెగ్లెట్ చేస్తూ ఉంటారు కొంతమంది.. ఇది సరైన పద్ధతి కాదని.. ఈ సమస్య పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు..

స్లీప్ అప్నియాకు సంబంధించిన తలనొప్పి కూడా తెల్లవారుజామున సంభవిస్తుంది. మైగ్రేన్ వల్ల తలనొప్పి వస్తుంది. ఇది చాలా తరచుగా ఉదయాన్నే వస్తుంది. విపరీతమైన ఒత్తిడి, శరీరంలో నీరు లేకపోవడం, నిద్రలేమి వంటి సమస్యల వల్ల తలనొప్పి వస్తుంది. ఉదయం నిద్ర లేచిన వెంటనే తలనొప్పి రావడానికి శరీరంలో రక్తం లేకపోవడం కూడా కారణకావొచ్చు.

శరీరంలో ఆక్సిజన్ తగినంత లేకపోయినా కూడా తలనొప్పి తో పాటు బలహీనత మైకం కూడా వస్తుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ ను పరిశీలించాలి. అవి తక్కువగా ఉంటే మాత్రం ఉదయం తలనొప్పి వస్తుంది. డిహైడ్రేషన్ సమస్యతో బాధపడుతున్న వారిలో ఉదయాన్నే తలనొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నిద్రలేమి కారణంగా ఒత్తిడి రాత్రి సమయంలో వర్క్ చేసే వారికి ఉదయాన్నే తలనొప్పి వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయి.

ఉదయాన్నే తలనొప్పిగా ఉన్నప్పుడు ఒక గ్లాస్ చల్లటి నీటిలో నిమ్మ రసాన్ని కలిపి తాగటం మంచిది. దీని వల్ల నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు. ప్రతి రోజు కచ్చితంగా ఎనిమిది గంటల సమయం నిద్రకు కేటాయించటం ద్వారా తలనొప్పుల బారిన పడకుండా ఉండవచ్చు. అలాగే రోజువారిగా వ్యాయామాలు, యోగ , ధ్యానం, మెడిటేషన్ వంటివి చేస్తూ ఉండాలి. ఈ సమస్య మరి తీవ్రంగా ఉన్నప్పుడు వైద్యుల వద్దకు వెళ్లి తగిన చికిత్స పొందటం మంచిది.