అమేజింగ్, ఇలాంటి నల్ల జామను ఎప్పుడైనా చూశారా, వైరల్‌గా మారిన బ్లాక్ గవా

  • Published By: naveen ,Published On : June 13, 2020 / 11:59 AM IST
అమేజింగ్, ఇలాంటి నల్ల జామను ఎప్పుడైనా చూశారా, వైరల్‌గా మారిన బ్లాక్ గవా

Updated On : June 13, 2020 / 11:59 AM IST

జామ లేదా జామి (Guava) మిర్టేసి కుటుంబానికి చెందిన పండ్ల చెట్టు. ఇంట్లో కూడా పెరిగే చెట్టు. జామ పండ్లు చాలా తియ్యగా ఉంటాయి. రుచే కాదు ఆరోగ్యానికి కూడా మంచిదంటారు. సాధారణంగా జామలో కొన్ని తెల్లగా ఉంటాయి, కొన్ని ఎర్రగా ఉంటాయి. ఈ పండు ఒక విలక్షణమైన వాసనతో నిమ్మకంటే కొంచెం తక్కువ ఘాటుగా కలిగుంటుంది. జామ లోపలి గుజ్జు తియ్యగా లేక పుల్లగా ఉండి తెలుపు నుంచి ముదురు గులాబీ వర్ణం కలిగి ఉంటుంది. లోపలి గింజలు గట్టిగా ఉండి, పండుకూ పండుకు వాటి సంఖ్య మారుతూ ఉంటుంది.

అయితే, మీరు ఎప్పుడైనా నల్ల రంగులో ఉండే జామని చూశారా? కనీసం దాని గురించి విన్నారా? లేదు కదూ. అవును, జామ నల్ల రంగులో కూడా ఉంటాయి. ఇది నిజం. ఇందుకు నిదర్శనం ఈ చిత్రాలే. ఐఎఫ్ఎస్ అధికారి సుసంత నందా నల్ల రంగులో ఉండే జామ పిక్స్ ని షేర్ చేశారు. మీరు ఎప్పుడైనా నల్ల రంగులో ఉండే జామ చూశారా అంటూ ఆయనీ పిక్స్ షేర్ చేశారు. ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ”రెండేళ్ల క్రితం ఈ జామ చెట్టు నాటాం. ఇప్పుడే ఫలితాలు వస్తున్నాయి. నల్ల రంగులో జామ పండ్లు కాశాయి. ఇంత రుచికరమైన జామని నా జీవితంలో ఎప్పుడూ తినలేదు” అంటూ ట్వీట్ ముగించారాయన. జామ చెట్టు, నల్ల రంగు జామ పండు పిక్స్ ని కూడా ఆయన ట్విట్టర్ లో పోస్టు చేశారు.

ఈ ట్వీట్ వైరల్ గా మారింది. నల్ల జామ నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. వెంటనే నెటిజన్లు ప్రశ్నలవర్షం కురిపించారు. ఆ జామ పండుని కోసి లోపల ఎలా ఉందో తెలిసే పిక్ ని షేర్ చేయండి ప్లీజ్ అని రిక్వెస్టులు చేశారు. వారి రిక్వెస్ట్ కి ఓకే చెప్పిన ఐఎఫ్ఎస్ ఆఫీసర్ జామని రెండుగా కట్ చేశారు. దాని పిక్ ని ట్వీట్టర్ లో షేర్ చేశారు.

”నల్ల రంగు జామ లోపల ఏ రంగు ఉంటుంది అనే తెలుసుకోవాలని చాలా మంది స్నేహితులు అడిగార. దాన్ని నేను కట్ చేశాను. లోపల పింకిష్(ఊదా) కలర్ ఉంది. పచ్చి జామను నేను టేస్ట్ చేశాను” అని నందా ట్వీట్ చేశారు. 

చాలా మంది నెటిజన్లు నందా ట్వీట్ ను షేర్ చేశారు. ఇలాంటి నల్ల జామను లైఫ్ లో ఫస్ట్ టైమ్ చూశామని చెప్పారు. వావ్..సూపర్..దాన్ని టేస్ట్ ఎలా ఉంది అని అడిగారు. లైఫ్ లో ఇంతవరకు నల్ల జామ గురించి వినలేదని మరొక నెటిజన్ కామెంట్ చేశారు. తొలిసారి దీని గురించి చదువుతున్నా అని ఇంకొక నెటిజన్ ట్వీట్ చేశాడు. దీని గురించి ఎప్పుడూ వినలేదు, ఓసారి కచ్చితంగా ట్రై చేయాలి అని ఇంకో నెటిజన్ ట్వీట్ చేశాడు.