Ticket Prices: విమాన టిక్కెట్ల ధరలపై పరిమితి తొలగింపు.. కేంద్రం తాజా నిర్ణయం

దేశీయ విమానయాన సంస్థలకు కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. టిక్కెట్ ధలరపై విధించిన పరిమితిని తొలగించాలని నిర్ణయం తీసుకుంది. ఈ నెల 31 నుంచి ఈ నిర్ణయం అమలవుతుంది.

Ticket Prices: దేశీయ విమానయాన సంస్థలకు సంబంధించి టిక్కెట్ రేట్లపై విధించిన పరిమితిని ఎత్తేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఆగష్టు 31 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ గురువారం వెల్లడించింది. కోవిడ్ సందర్భంగా అప్పటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, దేశీయ విమాన టిక్కెట్ల ధరలపై కేంద్రం పరిమితి విధించింది.

Gurugram Club: క్లబ్బులో మహిళతో బౌన్సర్ల అసభ్య ప్రవర్తన… ప్రశ్నించినందుకు దాడి.. వీడియో వైరల్‌

మే 21, 2020న ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ప్రకారం టిక్కెట్ ధరలను అపరిమితంగా, డిమాండ్‌కు అనుగుణంగా పెంచడానికి వీల్లేదు. సాధారణంగా విమానయాన సంస్థలు సీజన్‌ను బట్టి టిక్కెట్ ధరల్లో మార్పులు చేస్తూ ఉంటాయి. అన్ సీజన్‌లో తక్కువగా, సీజన్‌లో ఎక్కువగా.. ఇలా ధరలను ఎప్పటికప్పుడు పెంచుతూ, తగ్గిస్తూ ఉంటాయి. అయితే, కేంద్రం అప్పట్లో తీసుకున్న నిర్ణయం వల్ల పరిమితంగా మాత్రమే ధరల్ని పెంచాల్సి వచ్చింది. దీంతో ఈ కాలంలో ప్రయాణికులకు భారీగా లబ్ధి కలిగింది. అయితే, ప్రస్తుతం కోవిడ్ పరిస్థితులు అదుపులోకి రావడం, ప్రయాణికుల సంఖ్య పెరగడంతోపాటు ఇతర అంశాల్ని పరిగణనలోకి తీసుకుంది కేంద్రం.

Kolkata Professor Row: ప్రొఫెసర్ బికినీ ఫొటోల వివాదం.. వీసీ క్షమాపణ కోరుతూ కోర్టులో పిటిషన్

అనేక అంచనాల తర్వాత టిక్కెట్ ధరలపై పరిమితిని ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి జ్యోతిరాధిత్య సింధియా ప్రకటించారు. ఈ నెల 31 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది. దీని ప్రకారం.. ఇకపై విమానయాన సంస్థలు మార్కెట్‌కు అనుగుణంగా టిక్కెట్ ధరల్ని పెంచుకునే వీలుంటుంది. ఇది ఆ సంస్థలకు మేలు చేస్తుంది. కేంద్ర నిర్ణయంతో స్టాక్ మార్కెట్లో దేశీయ విమానయాన సంస్థల షేర్లు భారీగా పెరిగాయి.

 

ట్రెండింగ్ వార్తలు