Kolkata Professor Row: ప్రొఫెసర్ బికినీ ఫొటోల వివాదం.. వీసీ క్షమాపణ కోరుతూ కోర్టులో పిటిషన్

బికినీ ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసినందుకు కోల్‌కతాలోని సెయింట్ జేవియర్ యూనివర్సిటీకి చెందిన ఒక ప్రొఫెసర్ ఉద్యోగం కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడా ప్రొఫెసర్.. యూనివర్సిటీపై న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నారు.

Kolkata Professor Row: ప్రొఫెసర్ బికినీ ఫొటోల వివాదం.. వీసీ క్షమాపణ కోరుతూ కోర్టులో పిటిషన్

Kolkata Professor Row: సోషల్ మీడియాలో బికినీ ఫొటోలు షేర్ చేసినందుకు కోల్‌కతాలోని సెయింట్ జేవియర్ యూనివర్సిటీకి చెందిన ఒక ప్రొఫెసర్ ఉద్యోగం కోల్పోయిన సంగతి తెలిసిందే. గత ఏడాది అక్టోబర్‌లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. ఈ వివాదంలో ఉద్యోగం కోల్పోయిన ప్రొఫెసర్ ప్రస్తుతం న్యాయపోరాటానికి సిద్ధమవుతోంది. యూనివర్సిటీ వీసీతోపాటు, ఉన్నతాధికారులపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేస్తోంది.

Terrorists Killed: జమ్మూలో ఉగ్రదాడి.. ముగ్గురు జవాన్ల వీరమరణం

గత ఏడాది యూనివర్సిటీకి చెందిన ఒక విద్యార్థి, తన ప్రొఫెసర్ బికినీ ఫొటోలు సోషల్ మీడియాలో చూస్తుండగా అతడి తండ్రి గమనించాడు. దీంతో ఆ ప్రొఫెసర్‌పై యూనివర్సిటీలో ఫిర్యాదు చేశాడు. ప్రొఫెసర్ అయ్యుండి, అలాంటి ఫొటోలు ఎలా షేర్ చేస్తారని ఆయన యూనివర్సిటీని నిలదీశాడు. దీనిపై స్పందించిన యూనివర్సిటీ వీసీ, ఉన్నతాధికారులు ప్రొఫెసర్‌ను తప్పుబట్టారు. అలా ఫొటోలు షేర్ చేయడం అభ్యంతరకరం, అనుచితం అని పేర్కొంటూ ఆమెపై ఒత్తిడి తెచ్చి బలవంతంగా ఉద్యోగానికి రాజీనామా చేయించారు. అంతేకాదు.. ఆమె చర్య వల్ల యూనివర్సిటీ గౌరవానికి భంగం కలిగిందని, అందువల్ల రూ.99 కోట్లు చెల్లించాలని యూనివర్సిటీ అధికారులు ఆదేశించారు. ఈ చర్యలపై ప్రొఫెసర్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తానేం తప్పు చేయలేదని, దీనిపై న్యాయ పోరాటం చేస్తానని చెబుతున్నారు. యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్, అధికారులు క్షమాపణలు చెప్పాలని కోరుతున్నారు.

Gurugram Club: క్లబ్బులో మహిళతో బౌన్సర్ల అసభ్య ప్రవర్తన… ప్రశ్నించినందుకు దాడి.. వీడియో వైరల్‌

‘ద చేంజ్.ఓఆర్‌జి’ అనే సంస్థ కూడా ప్రొఫెసర్‌కు మద్దతుగా న్యాయ పోరాటానికి సిద్ధమవుతోంది. అయితే, ప్రొఫెసర్ రాజీనామా చేయాలని తామేం ఒత్తిడి చేయలేదని, ఆమే స్వచ్ఛందంగా రాజీనామా చేసిందని యూనివర్సిటీ అధికారులు తెలిపారు. బికినీ ఫొటోలకు సంబంధించి ప్రొఫెసర్ వివరణ కూడా ఇచ్చారు. ఆ ఫొటోలు యూనివర్సిటీలో చేరక ముందు పోస్ట్ చేసినవని, అది కూడా తన అకౌంట్ ప్రైవేటు అకౌంట్ అని, అవి ఎలా బయటకు లీకయ్యాయో తెలుసుకోవాలని పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చినట్లు చెప్పారు. మరోవైపు సోషల్ మీడియాలోనూ యూనివర్సిటీ నిర్ణయాన్ని నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు.