Gurugram Club: క్లబ్బులో మహిళతో బౌన్సర్ల అసభ్య ప్రవర్తన… ప్రశ్నించినందుకు దాడి.. వీడియో వైరల్‌

క్లబ్బుకు వచ్చిన మహిళతో అసభ్యంగా ప్రవర్తించారు బౌన్సర్లు. అంతేకాదు.. ఈ విషయంపై ప్రశ్నించినందుకు ఆమె స్నేహితులతోపాటు, ఆమెపై కూడా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Gurugram Club: క్లబ్బులో మహిళతో బౌన్సర్ల అసభ్య ప్రవర్తన… ప్రశ్నించినందుకు దాడి.. వీడియో వైరల్‌

Updated On : August 11, 2022 / 8:22 AM IST

Gurugram Club: క్లబ్బుకు వచ్చిన మహిళతో అసభ్యంగా ప్రవర్తించారు బౌన్సర్లు. అంతేకాదు.. ఇదేంటని ప్రశ్నించినందుకు అతడి స్నేహితులతోపాటు ఆమెపై కూడా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన హరియాణాలోని గుర్‌గావ్‌లో గత ఆదివారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక ఉద్యోగ విహార్‌లో ఉన్న క్యాసా అనే నైట్ క్లబ్‌కు ఒక మహిళ, తన స్నేహితులతో కలిసి వెళ్లింది.

Thailand Allows Rajapaksa: సింగపూర్ టూ థాయ్‌లాండ్.. దేశంలో తలదాచుకొనేందుకు రాజపక్సకు తాత్కాలిక అనుమతిచ్చిన థాయ్‌లాండ్.. కానీ ఒక్క షరతు ..

అక్కడ ఎంట్రీ లైన్‌ వద్ద డోర్‌మ్యాన్ మహిళ శరీరాన్ని తాకుతూ అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆమె దీనికి అభ్యంతరం చెప్పింది. వెంటనే ఆమె స్నేహితులు కూడా దీనిపై ప్రశ్నించారు. అక్కడ చిన్న వాగ్వాదం మొదలైంది. వెంటనే మిగతా బౌన్సర్లు, మేనేజర్ అక్కడికి చేరుకున్నారు. ఆ జంటపై దాడికి పాల్పడ్డారు. మహిళ, ఆమె స్నేహితులను క్లబ్బు బయటకు లాక్కొచ్చి విచక్షణా రహితంగా దాడి చేశారు. దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన మహిళపై కూడా దాడి చేశారు. పక్కనున్న వారు ఆపేందుకు ప్రయత్నించినా బౌన్సర్లు వినలేదు. దాడిలో గాయపడ్డ జంట, మరో స్నేహితుడు కలిసి స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బౌన్సర్లతోపాటు, మేనేజర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Toronto International Film Festival 2022 : టొరంటో ఫిలిం ఫెస్టివల్ లో రాజమౌళి.. హాలీవుడ్ డైరెక్టర్స్ తో సినీ చర్చలు..

కాగా, ఈ దాడిని అక్కడున్న వారు కొందరు వీడియో తీశారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారింది. వీడియో వైరల్ కావడంతో పోలీసులు వేగంగా స్పందించారు. కాగా, సీసీ టీవీ ఫుటేజీ పరిశీలిస్తున్నామని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారు. గాయపడ్డ బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందారు.